శేఖర్ కమ్ములకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పేసిన చై..నవ్వులే నవ్వులు..!

శేఖర్ కమ్ములకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పేసిన చై..నవ్వులే నవ్వులు..!

by Anudeep

Ads

శేఖర్ కమ్ముల దర్శకత్వం లో సాయి పల్లవి, నాగ చైతన్య జంట గా “లవ్ స్టోరీ” సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా వీరు ముగ్గురు రానా “నెంబర్ 1 యారి” షో కు వచ్చారు. ఈ సందర్భం గా సినిమా షూటింగ్ కు సంబంధించిన ముచ్చట్లను పంచుకున్నారు.

Video Advertisement

no 1 yaari

ఈ సందర్భం గా సాయి పల్లవి, చై లు శేఖర్ కమ్ముల గురించి చెప్పారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. “శేఖర్ సర్ విషయం లో నేను చాలా పొసెసివ్.. ఆయన నేను సెట్ లో ఉన్న టైం లో ఎప్పుడైనా చై ని మెచ్చుకుంటే కోపం గా చూసేస్తా.. అలాగే.. అసలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయనకీ సలహా ఇస్తూ ఉంటా. దానికి ఎలా రియాక్ట్ అవుతారా అని చూస్తా..” అంటూ నవ్వేసింది. ఇక శేఖర్ కమ్ముల అందుకుని “నేను ఎవరిని పొగడనని..గుడ్ అనే చెబుతూ ఉంటా అని.. నచ్చకపోతే.. మానిటర్ నుంచి దూరం గా వెళ్తా అని అన్నారు. ఇక చైతన్య అందుకుని..” గుడ్ అనే అంటారు.. ఈ మధ్య యాక్ అనే పదం కూడా నేర్చుకుంటున్నారు..” అని చెప్పగానే అందరు నవ్వేశారు.


End of Article

You may also like