Ads
YS Vivekananda Reddy: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ ! ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి బాబాయ్ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే, ప్రభుత్వం ఈ కేసు పైన సిబిఐ విచారణ కూడా వేశారు. గత కొన్ని రోజులుగా విచారిస్తున్న సిబిఐ ఈ కేసులో నిన్న మరో ట్విస్ట్ బయటపడింది.
Video Advertisement
వివేకాందన కేసులో తమను అరెస్ట్ చెయ్యకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హై కోర్టులో పిటిషను దాఖలు చేసారు కడప జిల్లా మోతునూతలపల్లి కి చెందిన వై సునీల్ యాదవ్ మరియు అయన కుటుంబంలోని నాలుగు సభ్యులు. ఒకవేళ ఈ కేసులో సిబిఐ విచారణ అవసరమని భావిస్తే న్యాయవాది సమక్షలోనే జరగాలని కోర్టుకు తెలిపారు.
Also Read: రోజు టిఫిన్ గా ఇడ్లి లేదా దోశ తింటున్నారా.? అయితే జాగ్రత్త…ఇది తప్పక తెలుసుకోండి.!
అంతే కాదు తమపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అంటూ హై కోర్టుని కోరారు. సీబీఐ తనకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ఇచ్చిందని దీనికోసం ఢిల్లీ కి కూడా వెళ్ళమని విచారణ సమయంలో తమపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని చెప్పుక్కుకొచ్చారు. అనుమతో లేకుండా నే లై డిటెక్టర్ ని కూడా ప్రయోగించినట్టు పిటీషనర్ ఆరోపణలు చేసారు. ఈ కేసు విచారణ సోమరవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉన్నటు తెలుస్తుంది.
End of Article