రోజు టిఫిన్ గా ఇడ్లి లేదా దోశ తింటున్నారా.? అయితే జాగ్రత్త…ఇది తప్పక తెలుసుకోండి.!

రోజు టిఫిన్ గా ఇడ్లి లేదా దోశ తింటున్నారా.? అయితే జాగ్రత్త…ఇది తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

Article sourced from: a youtube channel named Vismai TV

Video Advertisement

ఇప్పుడు ఉన్న జీవన విధానాన్ని బట్టి మనిషి యొక్క ఆహార అలవాట్లు కూడా మారుతున్నాయి. ఎంతోమంది డైటింగ్ పేరుతో తమకు నచ్చిన ఫుడ్ కి దూరంగా ఉంటున్నారు. అన్నం మానేసి వాటి స్థానంలో ఏదైనా టిఫిన్ ని తీసుకుంటున్నారు. అంతకుముందు మధ్యాహ్నం రాత్రి అన్నం తినే వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం పూట మాత్రమే అది కూడా కొంచెం మోతాదులో అన్నం తీసుకుంటున్నారు.

కానీ ఎక్కువసార్లు టిఫిన్ చేయడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందట. అది ఎలాగంటే. టిఫిన్ లలో ఎక్కువగా తీసుకునేది ఇడ్లీ, దోస. ఇడ్లీ లో సాంబార్ కానీ కారం పొడి కానీ లేకపోతే చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ సాంబార్, కారం పొడి వల్ల అసిడిటీ వస్తుంది. మినప్పప్పు లో బియ్యం కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి.

దోస మనం నూనెతో చేస్తాం. కాబట్టి దోస ఆయిల్ ఫుడ్ కిందకే వస్తుంది. పది పన్నెండు సంవత్సరాల వరకు వరుసగా ఇడ్లీ, దోస తిన్న వాళ్లకి మధుమేహ సమస్యలు తొందరగా వచ్చే అవకాశం ఉందట. అంతేకాకుండా ఇడ్లీ దోస తయారు చేసే పిండిలో కూడా బియ్యం ఉంటుంది. కాబట్టి మనం అన్నం మానేసినంత మాత్రాన అన్నం పూర్తిగా తిన్నట్లయితే కాదు. ఇడ్లీ దోస రూపంలో కూడా మనం పరోక్షంగా అన్నమే తీసుకుంటున్నాం.

చపాతీలు కూడా తరచుగా తింటే వేడి చేస్తుంది. ఇవన్నీ కాకుండా బజ్జీలు బోండాలు ఇలాంటివి తింటే వాటిలో అన్నం కంటే కూడా ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయట. పాత కాలం వాళ్ళు తిన్న పద్ధతులు సరైనవి. వాళ్లు తరచుగా తీసుకునే రాగిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు ఇంకా బలం గా ఉండే వాళ్ళు.

డాక్టర్లు ఏం చెబుతున్నారంటే పొద్దున పూట ముందు రోజు రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ లేదా తాజా పండ్లు కానీ తీసుకోవాలట. ముఖ్యంగా ఖర్జూరం తీసుకుంటే చాలా మంచిదట. మధ్యాహ్నం కడుపునిండా భోజనం చేయాలట. రాత్రిపూట టిఫిన్లు తగ్గించి పండ్లు, లేదా సలాడ్ తీసుకోవాలి.

అంతేకాకుండా మజ్జిగ కానీ పాలు కానీ తాగి పడుకోవాలి. రాత్రిపూట కడుపునిండా తినకపోవడమే మంచిది. నూనె తో తయారు చేసినవి కూడా వీలైనంతవరకు తగ్గించాలి. తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

watch video :


You may also like