“నారప్ప” లో వెంకటేష్ చిన్న కొడుకుగా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? అంతకుముందు ఏ సినిమాలో నటించాడంటే.?

“నారప్ప” లో వెంకటేష్ చిన్న కొడుకుగా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? అంతకుముందు ఏ సినిమాలో నటించాడంటే.?

by Mohana Priya

Ads

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా నారప్ప. ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమా బృందం డిజిటల్ రిలీజ్ వైపు ఆసక్తి చూపింది. ఈ సినిమా రీమేక్ అయినా కూడా వెంకటేష్ నటన, కథనం ఈ సినిమాని తెలుగులో కూడా సూపర్ హిట్ చేశాయి.Narappa cinema hero younger son Rocky unknown details

Video Advertisement

నారప్ప అనే ఒక వ్యక్తి, తన కుటుంబం ఎదుర్కొనే సంఘటనల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఇందులో నారప్ప పెద్ద కొడుకుగా కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన కార్తీక్ రత్నం నటించగా, చిన్న కొడుకుగా రాకీ అనే అబ్బాయి నటించాడు. రాకీ అసలు పేరు గీతాకృష్ణ. కానీ అందరూ రాకీ అని పిలుస్తారట. రాకీ రాజమండ్రికి చెందినవారు. రాకీ సోదరుడు కాస్టింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు.

Narappa cinema hero younger son Rocky unknown details

రాకీ కి చిన్నప్పటి నుంచి కూడా నటన అంటే చాలా ఆసక్తి ఉండేదట. నారప్ప సినిమా కోసం ఆడిషన్స్ ఉన్నాయని తెలిస్తే ఫోటోలు అని పంపించారు. నారప్ప సినిమా కాస్టింగ్ డైరెక్టర్ హైదరాబాద్ కి రమ్మని చెప్పడంతో హైదరాబాద్ కి వచ్చాడట. తర్వాత ఈ సినిమా కి సెలెక్ట్ అయ్యాడట. రాకీకి ఇది మొదటి సినిమా కాదు. అంతకుముందు రంగస్థలం సినిమాలో కూడా నటించాడు రాకీ.

Narappa cinema hero younger son Rocky unknown details

narappa fame rocky in rangasthalam

ఆ సినిమాలో పోస్టర్ అంటించే వ్యక్తి గా నటించాడు రాకీ. కానీ తన పాత్ర ఎడిటింగ్ లో కట్ అయ్యిందట. ఈ ఒక్క సినిమానే కాదు చాలా సినిమాల్లో తన పాత్రలు ఎడిటింగ్ లో పోయాయట. ఈ విషయాన్ని రాకీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే వెంకటేష్ అంత పెద్ద నటులు అయినా కూడా వీళ్ళ అందరితో బాగా కలిసిపోయేవారు అని, నారప్ప సినిమా షూటింగ్ అందులోనూ ముఖ్యంగా అంత మంచి బృందంతో షూట్ చేయడం ఒక మంచి అనుభవాన్ని ఇచ్చింది అని అన్నాడు రాకీ.


End of Article

You may also like