s/o. సత్యమూర్తి లో నటించిన ఈ చిన్నారి గుర్తుందా.? ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో చూడండి.!

s/o. సత్యమూర్తి లో నటించిన ఈ చిన్నారి గుర్తుందా.? ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో చూడండి.!

by Mohana Priya

Ads

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఒక మనిషికి విలువలు అనేవి ఎంత ముఖ్యమో చెప్పే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించగా, అదా శర్మ ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, పవిత్ర లోకేష్, సింధు తులానీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.

Video Advertisement

 

ఇంకా మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలాగే  టు వేరియేషన్స్ ఉన్న దేవరాజు పాత్రలో ఉపేంద్ర నటించారు. ప్రకాష్ రాజ్ కనిపించేది కొద్ది సేపే అయినా కూడా, ఆయన పాత్ర సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది. ఈ సినిమాలో సింధు తులాని, వెన్నెల కిషోర్ కూతురుగా నటించిన పాప మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాప పేరు వెర్నికా.

బేబీ వెర్నికా సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత, నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చిన్నప్పటి పాత్రను పోషించింది. బేబీ వెర్నికా తల్లి తన ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండేవారు. ఒకసారి అలా అప్లోడ్ చేసిన ఫోటోలు త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టిలో పడ్డాయి.

అప్పుడు త్రివిక్రమ్ సన్నాఫ్ సత్యమూర్తి లో పాప పాత్ర కోసం చైల్డ్ ఆర్టిస్ట్ లను ఆడిషన్ చేద్దామనుకున్నారు. బేబీ వెర్నికా ఫొటోస్ నచ్చడంతో తన తల్లిదండ్రులను ఒప్పించి సన్నాఫ్ సత్యమూర్తి ద్వారా మనందరికీ పరిచయం చేశారు. బేబీ వెర్నికా ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టడంతో సినిమాలకి దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.


End of Article

You may also like