హైదరాబాద్ లో “హలీం” అనగానే గుర్తొచ్చేవి ఈ 10 ప్లేసులే.! తప్పక ట్రై చేయాల్సిందే.!

హైదరాబాద్ లో “హలీం” అనగానే గుర్తొచ్చేవి ఈ 10 ప్లేసులే.! తప్పక ట్రై చేయాల్సిందే.!

by Sunku Sravan

Ads

రంజాన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరవాసులకు హలీం గుర్తొస్తుంది. గుమ గుమ వాసనల హలీం తినాలని దాని రుచిని ఆస్వాదించాలి. కానీ హలీం బట్టీలు నగరంలో ఒకటి రెండూ కాదు. ప్రతి వీధిలో దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా చికెన్, మటన్ హలీమ్ లను తయారుచేసి ఆహార ప్రియులకు ఆకర్షించేలా చేస్తారు. కానీ వీటన్నిటి లోకెల్లా అలీమ్ టెస్టు ఇంకా సూపర్ టేస్టీ గా తయారుచేసే కొన్ని స్పెషల్ సెంటర్లు ఉన్నాయి.. మరి అవేంటో చూద్దాం పదండి..!

Video Advertisement

పిస్తా హౌస్: ఈ బ్రాంచెస్ నగర వ్యాప్తంగా మొత్తం 10 వరకు ఉన్నాయి. ఇతర దేశాలలో కూడా ఈ సెంటర్లు ఉన్నాయి. ఇందులో తయారయ్యే హలీం డిమాండ్ తో పాటుగా, మంచి, రుచి నాణ్యత కలిగి ఉంటుంది. ఈ సెంటర్ల వద్ద జనాలు గుమిగూడి మరీ తింటారు.

కేఫె బహార్ : ఈ సెంటర్ బషీర్ బాగ్ లో ఉంది. ఇది దశాబ్దాల కాలం నుంచి హలీమ్ కు ప్రసిద్ధి. ఇందులో మటన్ హలీమ్ కు డిమాండ్ ఎక్కువ. దీన్ని ప్రత్యేకంగా నెయ్యితో తయారు చేసి అందిస్తారు. ఇక్కడ హలీమ్ తినాలంటే ఎంతటివారైనా వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి.

షాదాబ్: ఈ సెంటర్ పాతబస్తీలో చాలా ఫేమస్. ఇక్కడ ఒక్కసారి తిన్నారంటే ఇకనుంచి మరచిపోలేరు. ఈ షాదాబ్ సెంటర్లో చికెన్ కబాబ్ నుండి మటన్ బిర్యానీతో పాటుగా శాఖాహారం కూడా లభిస్తుంది. ఇక్కడ సాయంత్రం నుండి మొదలైతే తెల్లవారుజాము వరకు హలీం అందుబాటులో ఉంటుంది.

కేపే 555: ఈ యొక్క సెంటర్ మసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ ధరకు మంచి రుచిగా హలీం లభిస్తుంది. రాత్రి సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సింగల్ ప్యాక్ నుండి ఫ్యామిలీ ప్యాక్ వరకు అందుబాటు ధరలో దొరుకుతుంది.

బావర్చి: హైదరాబాదులో బావర్చి పేరు మీద చాలా సెంటర్లు ఉన్నాయి. కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి బావర్చి సెంటర్.. వీరికి మరెక్కడా సెంటర్లు ప్రారంభించలేదు. ఇక్కడ దొరికే హలీమ్ నోట్లో వేసుకున్నారంటే కరిగిపోతుంది. సాయంత్రం సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

షాగౌస్: ఇక్కడ తయారుచేసే హలీంకు ప్రత్యేకత ఉంది. ఉడకబెట్టిన, కోడిగుడ్డు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలతో తయారుచేస్తారు. ఇక్కడ దొరికే హలీం నగరంలో ఎక్కడ దొరకదు.

 

సర్వీ రెస్టారెంట్: ఈ రెస్టారెంట్ బంజారాహిల్స్ లో చాలా ఫేమస్. ఇక్కడ శుభ్రతకు ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ తయారుచేసే హలీమ్ ను సామాన్యులె కాకుండా, హలీమ్ తినడానికి సినీస్టార్స్ కూడా వస్తుంటారు. మటన్ హలీమ్ చాలా అద్భుతంగా ఉంటుంది.

బెహ్రూజ్: ఈ రెస్టారెంట్ మెహదీపట్నం టోలిచౌకి లో ఉంది. ఇక్కడ అలీమ్ నోట్లో వేసుకున్నారంటే కరిగిపోతుంది. గోస్ట్ హలీమ్ చాలా ఫేమస్ నిజాం కాలం నుంచే ఇక్కడ ఫేమస్.

 

మేహుఫీల్: నారాయణగూడలో ఉన్న రెస్టారెంట్ చాలా ఫేమస్. సాయంత్రం సమయంలో ఇక్కడ హలీమ్ తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. మటన్ హలీమ్ తినేందుకు జనాలు ఎగపడతారు.

ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ :హైదరాబాదులో ప్యారడైజ్ ఫుడ్ కోర్టు తెలియని వారుండరు. ఇక హలీమ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. రంజాన్ మాసం కంటే ముందుగానే ఇక్కడ హలీం ఫెస్టివల్ ను ప్రారంభిస్తారు.


End of Article

You may also like