“బాహుబలి” కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు “ఆర్ ఆర్ ఆర్” కు లేవట.. అవేంటంటే..?

“బాహుబలి” కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు “ఆర్ ఆర్ ఆర్” కు లేవట.. అవేంటంటే..?

by Anudeep

Ads

ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.

Video Advertisement

బాహుబలి సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతే కాకుండా అంతకు ముందు వరకు పాన్ ఇండియా సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవి. కానీ బాహుబలి తర్వాత ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు వచ్చాయి. ఈరోజు రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగానే విడుదల అయ్యింది.

rrr movie review

“ఆర్ ఆర్ ఆర్” బాహుబలి కంటే పెద్ద ప్రాజెక్ట్ అని రాజమౌళి ఇదివరకే చెప్పాడు. అయినప్పటికీ బయ్యర్లు కొంత టెన్షన్ గానే ఉన్నారు. అయితే వారి టెన్షన్ కి కూడా కారణం లేకపోలేదు. బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఉన్న అడ్వాంటేజ్ లు ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు లేవు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1 బాహుబలి రెండు పార్ట్ లు రిలీజ్ అయ్యే విషయంలో ఎలాంటి గందరగోళం చోటు చేసుకోలేదు. చెప్పిన డేట్ ప్రకారమే రిలీజ్ అయ్యాయి. దానితో ఆడియన్స్ లో ఆ హైప్ మైంటైన్ అయ్యింది. కానీ.. ఆర్ ఆర్ ఆర్ విషయంలో చాలా గందరగోళం చోటు చేసుకుంది. దీనివల్ల ఓ వైపు బడ్జెట్ పెరిగిపోయింది.

#2 బాహుబలి రిలీజ్ అయిన టైం లో ఓటిటిల హడావిడి ఈ రేంజ్ లో లేదు. కరోనా లాక్ డౌన్ పుణ్యమాని జనాలు ఓటిటీలలో సినిమాలు చూడడానికి బాగా అలవాటు పడ్డారు. నెల రోజులు ఆగితే.. ఓటిటిలో వచ్చేస్తుందిలే అన్న ధీమాతో చాలా మంది ఆగిపోయే అవకాశం ఉంది.

rrr 1

#3 బాహుబలి సినిమా రిలీజ్ టైం లో బుక్ మై షో వంటి యాప్స్ లో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చేసరికి టికెట్ ధరలను బాగా పెంచేశారు. అంతే కాకుండా ఈ టికెట్లను బ్లాక్ చేసేసి బయట వెయ్యి రూపాయలకు బ్లాక్ లో అమ్మేసే వాళ్ళు కూడా ఉన్నారు. దీనితో.. ఈ ధరలను చూసి థియేటర్ కు వచ్చే వాళ్ళు తక్కువే అని చెప్పొచ్చు.

#4 బాహుబలి సినిమాలో రానా విలన్ గా నటించారు. అప్పటికే రానా దేశమంతా పాపులర్ అయ్యి ఉన్నాడు. రానా అందరికి తెలిసిన వ్యక్తే అయ్యాడు. కానీ, ఆర్ ఆర్ ఆర్ లో విలన్ గా నటిస్తున్న వ్యక్తి హాలీవుడ్ కు తప్ప ఇండియన్స్ కు పెద్దగా తెలియరు.

rrr 2

#5 బాహుబలి లో తమన్నా, అనుష్క గ్లామర్ లాంటి కమర్షియల్ అంశాలు ఉన్నాయి. పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ ఆర్ ఆర్ ఆర్ cinimaki “నాటు నాటు” తప్ప ఊపు ఇచ్చే సాంగ్ మరొకటి అనిపించలేదు. అలియా భట్, ఒలీవియా మోరిస్ లు కూడా అంత హైప్ ఇచ్చినట్లు అనిపించలేదు.

#6 బాహుబలి కి రిలీజ్ రోజే హిట్ టాక్ వచ్చేసింది. పెంచిన టికెట్ ధరలను రెండు వారాల వరకు కొనసాగించారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి ఎలా ఉందొ.. ఆర్ ఆర్ ఆర్ పబ్లిక్ రెస్పాన్స్ వచ్చేవరకు చెప్పలేం.

rrr 3

#7 ఆర్ ఆర్ ఆర్ బాహుబలి సినిమాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కాదు. ఒక దేశభక్తి ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమాకు బాహుబలికి వచ్చినట్లు రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం లేదు.

#8  బాహుబలి పార్ట్ 2 అయినా, పార్ట్ 1 అయినా ఆ టైం కి స్టూడెంట్స్ కు ఎలాంటి పరీక్షల హడావిడి లేదు. అందుకే స్టూడెంట్స్ కూడా ఆ సినిమాల కోసం చాలా ఇంటరెస్ట్ చూపించారు. కానీ, ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చేసరికి ఇంకా టెన్త్, ఇంటర్ పరీక్షలు అవ్వలేదు. ఈ సినిమా ఆడియన్స్ లో స్టూడెంట్స్ వచ్చే శాతం తక్కువే.

rrr 4

#9 బాహుబలి 1 హిట్ అయ్యింది కాబట్టి.. దాని కంటిన్యుషన్ పార్ట్ 2 కు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆ పరిస్థితి లేదు.

#10 బాహుబలి సినిమా పూర్తి గా ఫిక్షనల్ మూవీ. కానీ ఆర్ ఆర్ ఆర్ చరిత్రలో నిలిచిన స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన మూవీ. ఈ సినిమా విడుదల తరువాత కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు నెలకొనే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ విషయమై బయ్యర్లు కొంత ఆందోళన చెందుతున్నారు.

 


End of Article

You may also like