బుల్లితెరకు పరిచయం అయిన యాంకర్స్ లో కొంతమంది మాత్రమే ఎప్పటికి గుర్తిండిపోయే అంత పాపులర్ అవుతారు.అలాంటి వారిలో అనసూయ భరధ్వాజ్ ఒకరుబుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై కూడా మేజిక్ చేయచ్చు అని నిరూపించారు యాంకర్ అనసూయ.జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ ను అందుకున్నారు అనసూయ..ఈ రోజు (మే 15 ) అనసూయ పుట్టినరోజు సందర్బంగా అనసూయ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..
1 అనసూయ 1985 మే 5 న జన్మించారు.పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. అనసూయ తండ్రి పేరు సుదర్శన రావు.అనసూయ భరద్వాజ్ ను పెళ్లి చేసుకోవడానికి తన తండ్రి ఒప్పుకోవడం కోసం 9 సంవత్సరాలు వేచి చేసారంట.
2 .హైదేరాబద్ లోనే బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసారు అనసూయ.చదువుకుంటున్న రోజుల నుండి కూడా అనసూయ కు మీడియాలో పనిచేయాలని ఆసక్తి ఉండేది అంట .
3 .అనసూయ మొదటసారి వెండితెరపై ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో కనిపించారు.తరువాత సాక్షి టీవీ లో న్యూస్ రీడర్ గా పనిచేసారు .అప్పటి నుండే అనసూయకు విపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది.నాగ సినిమాలో నటించినందుకు గాను అనసూయ అందుకున్న పారితోషకం 500 రూపాయలు అంట.
4 .అనసూయ మొదటగా యాంకర్ గా మారింది మాత్రం జబర్దస్త్ ప్రోగ్రాంతోనే.ఈ షో భారీ హిట్ కావడంతో ఆ షో కి యాంకర్ గా వ్యవరించిన అనసూయ కు ఎనలేని గుర్తింపు మొదలైంది.జబర్దస్త్ అంటే అనసూయ ,అనసూయ అంటే జబర్దస్త్ అనేంతగా..
5 ఈటీవీ,మా టీవీ ,జి టీవీ, ఇలా చాలా ప్రముఖ చానెల్స్ లో హోస్ట్ గా వ్యవరించారు అనసూయ భరధ్వాజ్.
6 తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన యాంకర్ సుమ.ఆ తర్వాత అదే రేంజ్ లో బుల్లితెరకు దగ్గరైన యాంకర్స్ లిస్ట్ లో అనసూయ కూడా ఉన్నారు.
7 తెలుగు భాష మీద బాగా పట్టు ఉండడంతో పాటు ,మంచి గ్లామర్, దానికి తగిన వాక్చాతుర్యం ఉండడంతో తిరుగులేని యాంకర్ గా మారారు అనసూయ .
8 ఎన్టీఆర్ నాగ సినిమాలో చిన్న పాత్రలో నటించిన అనసూయ తరువాత ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్ర ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించడం గమనించాల్సిన విషయం.
9 .తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇప్పటిదాకా ఒక యాంకర్ మీద పాట రాయడం జరగలేదు.కానీ విన్నర్ సినిమాలో సుయ సుయ అనసూయ అనే పాటను అనసూయను దృష్టిలో పెట్టుకొని రాయడం విశేషం.
10 సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.