ఈ 10 మంది తెలుగు హీరోయిన్లు పేరు మార్చుకున్నారని మీకు తెలుసా? అసలు పేర్లు ఏంటంటే?

ఈ 10 మంది తెలుగు హీరోయిన్లు పేరు మార్చుకున్నారని మీకు తెలుసా? అసలు పేర్లు ఏంటంటే?

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీ లోకి వెళ్ళిన తర్వాత జీవిత విధానం చాలా వరకు మార్చుకోవాల్సి వస్తుంది. కుటుంబానికి దూరంగా ఉండటం, ఆహారపు అలవాట్లు మారడం, షూటింగ్ సమయం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో కూడా ఒక్కొక్కసారి తెలియదు. సినిమాల్లోకి వెళ్ళాక జీవన విధానం కాదు దాదాపు జీవితమే మారిపోతుంది. సినిమాల్లోకి వెళ్లాలంటే టాలెంట్ కచ్చితంగా అవసరం. కానీ దానితో పాటు ఒక వ్యక్తి తనని తాను మార్చుకోవాల్సి ఉంటుంది. స్టైలింగ్, భాష ఇలా ఎన్నో ఉంటాయి. అలా మార్చుకోవాల్సిన విషయాల్లో కొంత మందికి పేరు కూడా ఉంటుంది.

Video Advertisement

పేరు మార్చుకోవడానికి మూడు కారణాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ పేరుతో ఇప్పటికే ఇండస్ట్రీలో వేరే వాళ్ళు ఉండడం. రెండోది వాళ్ల పేరు మరీ సాధారణంగా ఉండడం. మూడోది వాళ్ల పేరు మరీ డిఫరెంట్ గా పలకటానికి కూడా సులభంగా లేకుండా ఉండడం. ఇప్పుడు చెప్పిన మూడు కారణాలు వేరు వేరు గా ఉన్నా చివరికి ముఖ్యమైనది ఒకటే. వాళ్ల పేరు జనాల మైండ్ లో రిజిస్టర్ అవ్వడం. అందుకోసం చాలామంది నటులకు రెండోసారి నామకరణం జరిగింది. అదే పేరు మార్చుకోవడం అన్నమాట. పేర్లు మార్చుకున్న జాబితాలో మన హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు.  వాళ్ళలో కొంతమంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 రోజా – శ్రీలత

#2 రంభ – విజయలక్ష్మి

#3 అనుష్క శెట్టి – స్వీటీ

#4 జయసుధ – సుజాత

#5 సౌందర్య – సౌమ్య సత్యనారాయణ్

#6 భూమిక చావ్లా – రచన చావ్లా

#7 స్నేహ – సుహాసిని రాజా రామ్ నాయుడు

#8 నయనతార – డయానా మరియమ్ కురియన్

#9 జయప్రద – లలితా రాణి

#10 టబు – తబస్సుమ్ హష్మి

వీళ్లే కాకుండా సమంత (యశోద), సిల్క్ స్మిత(విజయలక్ష్మి), శృతిహాసన్ (శృతి రాజ్యలక్ష్మి హాసన్), అసిన్ (మేరీ), శ్రీదేవి (శ్రీ అమ్మ యంగర్ అయ్యప్పన్) ఇలా ఎంతోమంది సినిమాల్లోకి వచ్చేముందు పేర్లు మార్చుకున్నారు. అలా పేరు మార్చుకోవడానికి గల కారణం పైన చెప్పిన వాటిలో ఏదైనా అవ్వచ్చు.

ఇవన్నీ కాకుండా మరొక కారణం కూడా ఉంది అదేంటంటే న్యూమరాలజీ లేదా ఆస్ట్రాలజీ (జ్యోతిష్యం). కొంతమంది చేసే పని లో మంచి ఫలితాలు రావడానికి కూడా పేరు మార్చుకుంటారు. అలా ఎంతో మంది నటులు వాళ్ళ అసలు పేరు కంటే స్క్రీన్ నేమ్ తోనే ఇంకా పాపులర్ అయ్యారు. వేరే పేరుతో మనందరికీ పరిచయం అయ్యి, గుర్తింపును సంపాదించుకున్నా కూడా వాళ్ల ప్రతిభ తో ఆ గుర్తింపుని నిలబెట్టుకున్నారు.


End of Article

You may also like