చాలా మంది సినిమా అనగానే ఒక గ్లామర్ ప్రపంచం అనుకుంటారు. ఇంక హీరోయిన్స్ అంటే చాలా మందికి గ్లామరస్ రోల్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ కొంత మంది హీరోయిన్స్ మాత్రం స్కిన్ షో కి దూరంగా ఉన్నారు. అలా ఉండి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు కూడా. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 కీర్తి సురేష్

కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా స్కిన్ షో ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఇదే విషయాన్ని కీర్తి సురేష్ అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

#2 సాయి పల్లవి

ఫిదా సినిమా తోనే స్టార్ యాక్ట్రెస్ స్టేటస్ సంపాదించుకున్నారు సాయి పల్లవి. ఎంతో మంది స్టార్ హీరోలు కూడా సాయి పల్లవి నటనని, డాన్స్ ని ప్రశంసించారు. సాయి పల్లవి కూడా ఎక్స్ పోజింగ్ కి అలాగే ఆన్ స్క్రీన్ కిస్సింగ్ కి దూరంగా ఉంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

#3 ఐశ్వర్య రాజేష్

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తో తెలుగు నాట బాగా ఫేమస్ అయిపోయిన అమ్మాయి ఐశ్వర్య రాజేష్. కౌసల్య కృష్ణమూర్తి సినిమా తో ఐశ్వర్య తెలుగు వారికీ దగ్గరైంది. తెలుగు అమ్మాయే ఐన ఐశ్వర్య పుట్టి పెరిగింది అంతా చెన్నై లోనే.. తమిళనాట ఆమె దాదాపు పాతిక సినిమా లు వరకు నటించింది. ఇవి కాక, ఒక హిందీ సినిమా తో పాటు రెండు మలయాళం సినిమాలు కూడా చేసింది. ఆమె కూడా గ్లామర్ పాత్రలకి దూరంగానే ఉన్నారు.

#4 లయ

స్వయంవరం, ప్రేమించు, పెళ్ళాంతో పనేంటి ఇలా ఎన్నో సినిమాలతో ఎంతో పేరు సంపాదించుకున్నారు మన తెలుగు అమ్మాయి లయ. లయ కొంత కాలం క్రితం విడుదలైన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. లయ కూడా ఎక్కువ గ్లామర్ రోల్స్ చెయ్యలేదు.

#5 నిత్యా మీనన్

ఇప్పుడు ఉన్న బెస్ట్ యాక్ట్రెసెస్ లో ఒకరు నిత్యా మీనన్. నిత్యా మీనన్ కూడా గ్లామర్ రోల్స్ కంటే యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని అంతకు ముందు ఎన్నో సార్లు చెప్పారు.

#6 నజ్రియా నజీమ్

మలయాళ నటి నజ్రియా నజీమ్ రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. ఇప్పుడు నాచురల్ స్టార్ నాని తో కలిసి అంటే సుందరానికి సినిమాలో నటిస్తున్నారు. నజ్రియా కూడా గ్లామర్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చెయ్యలేదు.

#7 నివేతా థామస్

జెంటిల్మెన్, నిన్నుకోరి, బ్రోచేవారెవరురా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు నివేతా థామస్. నివేత ఇప్పటివరకు నటించిన దాదాపు అన్ని సినిమాలు నటనకి స్కోప్ ఉన్నవే.

nivetha 1

#8 రేవతి

సీనియర్ నటి రేవతి గారు కూడా ఎక్కువగా నటనకి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో మాత్రమే నటించారు.

 

#9 సౌందర్య

తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా ఎన్నో భాషల్లో నటించిన సౌందర్య గారు కూడా ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటించారు. ఇప్పటికి కూడా సౌందర్య గారి సినిమాలు చూస్తే సౌందర్య గారు ఎంత గొప్ప నటో మనకి అర్థమవుతుంది.

#10 అనుపమ పరమేశ్వరన్

ప్రేమమ్, శతమానం భవతి, తేజ్ ఐ లవ్ యు, రాక్షసుడు, కృష్ణార్జున యుద్ధం ఇలా ఎన్నో తెలుగు సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం నిఖిల్ తో 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఇప్పటి వరకు సినిమాల్లో  మోడ్రన్ దుస్తుల్లో కనిపించారు కానీ గ్లామర్ డోస్ ఎక్కువగా ఉన్న సినిమాల్లో నటించలేదు.


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE