Ads
సాధారణం గా హీరో అయినా, డైరెక్టర్ అయినా, హీరోయిన్ అయినా.. డెబ్యూ మూవీ విషయం లో చాలా కేర్ తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి. అయితే, ఒక్కోసారి ఇది బోల్తా కొట్టి ఫస్ట్ తీసిన మూవీస్ అంత ఆడకపోవచ్చు. లేదా మంచి టాక్ తెచ్చుకున్న ఆశించినంత గా కలెక్షన్ రాకపోవచ్చు. అలా జరిగినా.. సెకండ్ మూవీ తో మాత్రం హిట్ కొట్టేసిన పది డైరెక్టర్ల లిస్ట్ మనం ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
1. వంశి పైడిపల్లి:
మున్నా మూవీ తో డెబ్యూ ఇచ్చిన వంశి పైడిపల్లి “బృందావనం” సినిమా తో హిట్ కొట్టాడు. “మున్నా” సినిమా కూడా బాగుంటుంది కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం కురవలేదు.
2. నాగ్ అశ్విన్:
ఈయన తీసిన సినిమాలు రెండే అయినా.. రెండు మంచి టాక్ తెచ్చుకున్నాయి. “ఎవడె సుబ్రహ్మణ్యం”, ” మహానటి”. కానీ కలెక్షన్ల పరం గా మహానటి సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.
3. హరీష్ శంకర్:
షాక్ మూవీ తో డెబ్యూ ఇచ్చిన హరీష్ శంకర్ తన సెకండ్ మూవీ మిరపకాయ్ తో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బద్దలుకొట్టాడు.
4. ఎస్ ఎస్ రాజమౌళి:
ఎన్టీఆర్ తో “స్టూడెంట్ నెంబర్ వన్” మూవీ తో డెబ్యూ ఇచ్చిన రాజమౌళి మంచి పేరే తెచ్చుకున్నారు. కానీ తన సెకండ్ మూవీ ” సింహాద్రి” తో రికార్డు లు తిరగరాసేసారు.
5. కాష్ అనుదీప్:
కాష్ అనుదీప్ తొలి మూవీ పిట్టగోడ అంత గా ఆడలేదు. థియేటర్లలో రిలీజ్ ఐన తొందర్లోనే వెనక్కి వెళ్ళిపోయింది. కానీ, సెకండ్ మూవీ “జాతి రత్నాలు” తో అనుదీప్ కాసులు కురిపించేస్తున్నాడు.
6. హను రాఘవపూడి :
“అందాల రాక్షసి” హను రాఘవపూడి మొదటి సినిమా. ఈ సినిమా కి ఇప్పుడు కూడా ఫాన్స్ ఉన్నారు కానీ, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం పైసల్ రాలేదు. సెకండ్ మూవీ “కృష్ణగాడి వీర ప్రేమ గాధ” కాసులకి కాసులు, హిట్ టాక్ కూడా సొంతం చేసుకుంది.
7. గౌతమ్ తిన్ననూరి:
ఆయన తీసిన మళ్ళీ రావా, జెర్సీ రెండు సినిమాలు మంచి పేరే తెచ్చుకున్నాయి. కానీ, రెండో సినిమా జెర్సీ నెంబర్ వన్ గా నిలిచింది.
8. కొరటాల శివ:
ఈయనకి కూడా హిట్లే ఎక్కువ. ఫ్లాపులు తెలియవు. మిర్చి తో హిట్ కొట్టారు. సెకండ్ సినిమా శ్రీమంతుడు తో అంతకుమించిన హిట్ నే కొట్టారు.
9. శ్రీనువైట్ల:
శ్రీనువైట్ల డెబ్యూ మూవీ “నీకోసం” అంత మంచి టాక్ తెచ్చుకోలేదు. ఈ సినిమా లో రవితేజ హీరో గా నటించారు. శ్రీనువైట్ల రెండవ సినిమా “ఆనందం” మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
10. వివేక్ ఆత్రేయ:
ఈయన తీసిన రెండు సినిమాలు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా రెండు సూపర్ గుడ్ సినిమాలే. కానీ, రెండో సినిమా బ్రోచేవారెవరురా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడింది.
End of Article