గుర్తు పట్టలేనంతగా మారిపోయిన “100 పర్సెంట్ లవ్” యాక్టర్..! ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే..?

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన “100 పర్సెంట్ లవ్” యాక్టర్..! ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే..?

by kavitha

Ads

మరియం జకారియా అంటే తెలుగు ఆడియెన్స్ అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ డియ్యాలో డియ్యాలా పాటలో నటించిన నటి అంటే గుర్తుపడతారేమో. ఎందుకంటే 100 పర్సెంట్ లవ్ మూవీలోని ఈ సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. కొన్నేళ్ళ దాకా పెళ్ళిళ్ళలో, వేడుకల్లో ఈ పాట విపరీతంగా వినిపించింది.

Video Advertisement

సుకుమార్ దర్శకత్వంలో 2011 లో తెరకెక్కిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. డియ్యాలో డియ్యాలా పాటలో నటించిన నటికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. మరి ఆ నటి ఎవరు? ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం.. యంగ్ హీరో నాగ చైతన్య , తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా, బన్నీవాసు నిర్మించారు. 2011 లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీలోనీ ఐటమ్ సాంగ్ లో నటించిన నటి పేరు మరియం జకారియా. ఈమె ఇరానియన్-స్వీడిష్ నటి. మరియం బాలీవుడ్, తెలుగు, తమిళ సినిమాలలో నటించింది. మరియం స్వీడన్‌లో మోడల్‌గా, డ్యాన్స్ టీచర్‌గా మరియు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే స్వీడన్‌లో ఇండిస్క్ డాన్స్ స్టూడియోను స్థాపించారు. ఆమె బాలీవుడ్ సినిమాలలో నటించడం కోసం 2009లో ముంబైలో అడుగుపెట్టారు. ఆ తరువాత పలు యాడ్స్ లో నటించారు. కోకోకోలా యాడ్ లో ఇమ్రాన్ ఖాన్ తో కలిసి నటించారు. తమిళ దర్శకుడు సుందర్ సి. ఆమె డ్యాన్స్ ను యూట్యూబ్‌లో చూసి తన మూవీ నగరం (2010)లో ఐటెమ్ సాంగ్ లో ఛాన్స్ ఇచ్చారు.
ఆ తరువాత 100% లవ్ మూవీలో ఆఫర్ రావడంతో “డియ్యాలో డియ్యాలా”లో చేసింది. దాంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అల్లరి నరేష్‌తో మడత కాజాలో ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ లో వచ్చిన గ్రాండ్ మస్తి మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ మెంబర్స్  ఫాలో అవుతున్నారు. తన డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

Also Read: “పటాస్” ప్రియ గుర్తుందా..? ఇప్పుడు బిగ్‌బాస్ కి వచ్చిందా..?


End of Article

You may also like