తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. హోస్ట్ అక్కినేని నాగార్జున మొత్తం 14 మంది పోటీదారులను హౌస్ లోకి పంపించి తాళం వేశాడు. అయితే, సీజన్ 7 గురించి ఉల్టాపల్టా అంటూ ప్రమోషన్స్ లో చెప్పినట్టుగానే షో మొదటి నుంచీ ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు.

Video Advertisement

14 మంది కంటెస్టెంట్స్ లో ఏడుగురు మహిళా పోటీదారులను ఎన్నుకుని షోని కలర్ ఫుల్ గా మార్చారు. అయితే వీరిలో రతిక రోస్‌ బిగ్ బాస్ స్టేజ్ మీద తన అందంతో ఆకట్టుకుంది. దాంతో ఈ బ్యూటీ ఎవరా అంటూ నెటిజెన్లు గూగుల్ లో గాలిస్తున్నారు. మరి రతిక రోస్‌ ఎవరో ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రతిక రోస్‌ అచ్చమైన  తెలుగమ్మాయి. తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాకు చెందిన అమ్మాయి. నటన పై ఆసక్తితో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. కానీ సినిమాలలో అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చాలా చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. కానీ ఆమె అనుకున్న విధంగా లీడ్ రోల్స్ మాత్రం రాలేదు.
రతిక రోస్‌ 2016లో మొదట స్టాండప్ కమెడియన్ కెరీర్ ను ప్రారంభించింది. అడపాదడపా సినిమాలలో నటిస్తున్నప్పటికి చెప్పుకోదగ్గ క్యారెక్టర్లలో నటించలేదు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే మూవీలో ఒక పాత్రను చేసింది. బెల్లంకొండ గణేష్ హీరోగా వచ్చిన ‘నేను స్టూడెంట్‌ సర్‌’ మూవీలో పోలీసాఫీసర్‌గా నటించింది. ఈ పాత్రతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో అడుగుపెట్టింది. ఆ టైమ్ లో ఆమె తనను ప్రియగా పరిచయం చేసుకుంది. ఈటీవీలో ప్రసారం అయిన పటాస్ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. ఈ షోలో కామెడియన్స్ కి సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
అలా ప్రియ తన స్టాండప్ కామెడీతో ఆడియెన్స్ ని నవ్వించి, పాపులర్ అయ్యింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని మోడలింగ్ వైపు వెళ్ళింది. అలా ఈ తెలుగు అమ్మాయికి టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్ లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత మరో మూవీ చేసింది. కానీ ఆ మూవీ రిలీజ్ కు ముందే ఆగిపోయింది.

Also Read: “బిగ్‌బాస్ తెలుగు” ఫైనలిస్ట్ జవాన్ సినిమాలో నటించారా..? ఎవరంటే..?