ఒక్క హిట్ తో ప్రభాస్, షారుఖ్ లను వెనక్కి నెట్టేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే.?

ఒక్క హిట్ తో ప్రభాస్, షారుఖ్ లను వెనక్కి నెట్టేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే.?

by Harika

Ads

మేధా శంకర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈమె 12th ఫెయిల్ సినిమాలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మేధా శంకర్, శ్రద్ధ జోషి అనే ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా నటించి ప్రశంసలని పొందుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ నాకు ఫిదా అయినా ప్రేక్షకులు ఆమె ఎవరా అని ఆరాధించడం మొదలు పెట్టారు. కాగా 12 ఫెయిల్ సినిమాకి విద్దు వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. శ్రద్ధ గోషి పాత్రలో ఈమెఅద్భుతంగా నటించింది. మేధా శంకర్ నటన చూసి అంతా మెచ్చుకుంటున్నారు.

Video Advertisement

అయితే ఈమె సినిమా ఇండస్ట్రీకి కొత్తగా ఎంట్రీ ఇవ్వలేదు. 2017 నుండి ఈమె ఇండస్ట్రీలో ఉన్నప్పటికి ఈమెకు సరైన అవకాశాలు రాలేదు. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు రాక మౌనంగా ఉండిపోయింది. కాని 12th ఫెయిల్ చూసిన వాళ్ళందరూ కూడా మేధా శంకర్ ని మెచ్చుకుంటున్నారు. మేధా శంకర్ కి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేధా శంకర్ భారతీయ నటి, మోడల్, సింగర్ కూడా. ఈమె నోయిడా ఉత్తరప్రదేశ్ లో పుట్టింది. మేధా శంకర్ తండ్రి పేరు అభయ్ శంకర్. తల్లి పేరు రచన శంకర్. సోదరుడు పేరు అపూర్వ శంకర్.

విద్యా భారతి పబ్లిక్ స్కూల్, నోయిడాలో ఈమె స్కూలింగ్ పూర్తి చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో ఈమె ఫ్యాషన్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2019లో మేధా బ్రిటిష్ టెలివిజన్ సిరీస్, బెచం హౌస్ లోకి నటించారు. అదే ఆమె పొందిన మొట్టమొదటి అవకాశం. కాగా ఈ ముద్దుగుమ్మకి ఇంస్టాగ్రామ్ లో 29.3 k ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా imdb మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ అఫ్ ది వీక్ లో ప్రభాస్, షారుక్ లను మించిన స్టార్ డం అందుకుంది ఈ భామ.

 

 


End of Article

You may also like