Ads
భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న నిత్యా మీనన్, మురళీ శర్మ, రావు రమేష్, మరొక హీరోయిన్‌గా నటిస్తున్న సంయుక్త మీనన్ కూడా కనిపించారు.
Video Advertisement
ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్‌గా రూపొందించబడింది. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు.
అయితే ట్రైలర్ విడుదల అయిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకు కారణం ట్రైలర్ నుండి చాలా ఊహించుకున్నారు. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని, ఇంక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా ఉండదు అని అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులకి అలా అనిపించలేదు.
బ్యాక్ గ్రౌండ్ విషయంలో ఫ్యాన్స్ చాలా అంచనాలే పెట్టుకున్నారు. అయితే.. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆశించినంత లేకపోవడంతో కొంత డిజప్పోయింట్ అయ్యారు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా మీద కూడా అలాగే ఉన్నాయి. వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది అనే ఒక నమ్మకం వచ్చింది.
కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం అంత హైప్ క్రియేట్ అవ్వడం లేదు. అలాగే ట్రైలర్ లో కూడా చాలా వరకూ మనకి అంతకుముందు విడుదలైన వీడియోల్లో, పోస్టర్స్ లో చూపించిన షాట్స్ మాత్రమే ఉన్నాయి. మరోవైపు ఈ ట్రైలర్ లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఏదైనా సినిమా తీసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగడం కామనే. అవి కధకి ఇబ్బంది కానంతవరకు నష్టం ఏమీ ఉండదు. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటో మీరు కూడా చూసేయండి.
Watch Video:
https://www.youtube.com/watch?v=Z_zBdR8VZdM
End of Article