మనం ఓ సినిమా ను ఎందుకు చూస్తాం.. సరదాగా టైం గడపడానికి లేకపోతె మన ఫేవరెట్ యాక్టర్ ను చూడడానికి. కేవలం అందుకోసం మాత్రమే కాకుండా, కొంతమంది అభిమానులకు మరొక సరదా కూడా ఉంటుంది. అదే అండి…ఫ్యాన్ వార్స్. సోషల్ మీడియాల్లోను, హీరో పేజీల్లోనూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కామెంటుతూ సరదాలు పడుతుంటారు కొందరు. కానీ, ఒకప్పుడు ఇవేమి లేవు కదా..

Video Advertisement

Also Read:  ఈ వారం రాశి ఫలాలు ఈ రాశి వారు ఈ వారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి !

అప్పట్లో విడుదలైన సినిమాల్లో ఎక్కువ భాగం ఫ్యాన్ వార్స్ అంటే చిరు – బాలయ్య సినిమాల మధ్యే ఉండేవి. ఆ రోజుల్లో వీరిద్దరూ పోటీలు పడి మరీ సినిమాలు రిలీజ్ చేసేవారు. వీరి కాంబో లో వచ్చిన సినిమా లో ఏ హీరో సినిమా హిట్ అయితే.. ఆ హీరో అభిమానులు మరో హీరో అభిమానులను టార్గెట్ చేస్తూ సంబరాలు చేసేవారు.. ఇంకా అప్పటి ఫ్యాన్ వార్స్ రేంజ్ వేరే లెవెల్ ఉండేది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ అయితే ఆ కిక్ వేరే లెవెల్. అయితే, వీరిద్దరి సినిమాల ఒకేసారి రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అయిన 15 సినిమాల లిస్ట్ ను మనం ఇప్పుడు చూద్దాం..

#1 చట్టం తో పోరాటం – ఆత్మబలం

Chattamtho Poratam – Atmabalam
ఈ రెండు సినిమాలు 1984 లో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఆ రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోల సినిమా లు  ఒకేరోజు రిలీజ్ అవడం ఇదే మొదటిసారి. చిరు సినిమా హిట్ కొడితే, బాలయ్య బాబు సినిమా యావరేజ్ గా నిలిచింది.

#2 భార్గవ రాముడు – దొంగ మొగుడు

2 Bhargava Ramudu – Donga Mogudu
ఈ రెండు సినిమాలు 1987లో వచ్చాయి. రెండు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

#3 కధానాయకుడు – రుస్తుం

Kathanayakudu – Rusthum
ఈ రెండు సినిమాలు 1984లో వచ్చాయి. కథానాయకుడు సినిమా బాలయ్య బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఓ సక్సెస్ ఫుల్ హీరో గా బాలయ్యను నిలబెట్టింది. మరో వైపు రుస్తుం సినిమా మాత్రం అంతగా ఆడలేదు.

#4 ముద్దుల కృష్ణయ్య – మగధీరుడు

4 muddula krishnayya - magadheerudu
బాలకృష్ణ సినిమా ముద్దుల కృష్ణయ్య విడుదల అయిన వారానికి మెగాస్టార్ మగధీరుడు సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు 1986లో వచ్చాయి. ముద్దుల కృష్ణయ్య ఏమో సూపర్ హిట్ అయిపొయింది. మగధీరుడు యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

#5 మంగమ్మ గారి మనవడు – ఇంటిగుట్టు :

5 Mangamma Gari Manavadu – Intiguttu
ఈ రెండు సినిమాల 1984 లో వచ్చాయి. ఫస్ట్ టైం బాక్స్ ఆఫీస్ క్లాష్ అయిన సినిమాలు ఈ రెండే. బాలకృష్ణ యాక్ట్ చేసిన మంగమ్మ గారి మనవడు సినిమా సూపర్ హిట్ అయింది. చిరంజీవి ఇంటిగుట్టు సినిమా మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

#6 నిప్పులాంటి మనిషి – కొండవీటి రాజా:

6 Nippulanti Manishi – Kondaveeti Raja
ఈ సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ ను బద్దలుకొట్టేశాయి. ఈ రెండు సినిమాలు 1986లో వచ్చాయి.

#7 రాము- పసి వాడి ప్రాణం:

7 Ramu – Pasivadi Pranam
ఈ రెండు సినిమాలు 1987 లో వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ నే తెచ్చుకున్నాయి. పసి వాడి ప్రాణం సినిమా మాత్రం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

#8 పెద్దన్నయ్య – హిట్లర్

8 Peddannayya – Hitler
1988 లో క్లాష్ అయ్యాక, మళ్ళీ పదేళ్ల తరువాత ఈ సినిమాలతో బాలయ్య చిరు క్లాష్ అయ్యారు. ఈ రెండు సినిమాలు1997 లో వచ్చాయి. ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. హిట్లర్ మూవీ తో మెగాస్టార్ అప్పట్లో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చారు.

#9 అపూర్వ సహోదరులు- రాక్షసుడు

9 Apoorva Sahodarulu – Rakshasudu
ఈ రెండు సినిమాలు 1986 లో వచ్చాయి. ఈ సినిమాల కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి.

#10 ఇన్స్పెక్టర్ ప్రతాప్-మంచి దొంగ

10 Inspector Pratap – Manchi Donga
ఈ రెండు సినిమాలు 1988 లో వచ్చాయి. ఈ రెండు మాస్ హిట్ లు కొట్టాయి. ఈ రెండు సినిమాల్లోనూ విజయశాంతే హీరోయిన్.

#11 నరసింహ నాయుడు – మృగరాజు

11 Narasimha Naidu – Mrugaraju
ఈ రెండు సినిమాలు 2001 లో వచ్చాయి.  బాలయ్య బాబు కు సింహా టైటిల్ కలిసిరావడం అనేది అప్పటినుంచే వుంది. ఈ సినిమా కూడా సూపర్ అయింది. అయితే, అంచనాలు అందుకోలేక మృగరాజు మాత్రం హిట్ కాలేదు.

#12 సమర సింహా రెడ్డి – స్నేహం కోసం

12 samara simha reddi -sneham kosam
ఈ సినిమాలు కూడా ఒకేసారి వచ్చి హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు1999 లో వచ్చాయి. సమర సింహా రెడ్డి సినిమా బాలయ్య బాబు ను మాస్ హీరో గా ఓ లెవెల్ కు తీసుకెళ్లింది.

#13 గౌతమి పుత్ర శాతకర్ణి – ఖైదీ నెంబర్ 150

13 Gautamiputra Satakarni – Khaidi No. 150
ఈ రెండు సినిమాలు 2017 లో వచ్చాయి. ఈ రెండు సినిమాలు తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకం. ఖైదీ చిరు 150 వ సినిమా కాగా, గౌతమి పుత్ర శాతకర్ణి బాలయ్యకు వందవ సినిమా.

#14 వంశోద్ధారకుడు – అన్నయ్య

14 Vamshodharakudu – Annayya
ఈ రెండు సినిమాలు 2000 లో వచ్చాయి. మెగాస్టార్, బాలయ్య ఇద్దరు మొదటిసారి సంక్రాంతి కి రిలీజ్ చేసారు. వీటిల్లో అన్నయ్య సినిమా హిట్ అవ్వగా, వంశోద్ధారకుడు సినిమా ఫ్లాప్ అయింది.

#15 అంజి-లక్ష్మి నరసింహ

15 Lakshmi Narasimha – Anji
ఈ రెండు సినిమాలు 2004 లో వచ్చాయి. లక్ష్మి నరసింహ సూపర్ హిట్ అయింది. అంజి మాత్రం ప్లాప్ అయింది.

#16 అగ్నిగుండం – శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి


ఈ రెండు సినిమాలు 1984 లో వచ్చాయి. బాలకృష్ణ నందమూరి వారసుడి గా శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి సినిమాలో నటించి మెప్పించారు. ఈ సినిమాను సీనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ చేసారు. అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. మరో వైపు చిరంజీవి అగ్నిగుండం సినిమా అంతగా ఆడలేదు.

17. యుద్ధ భూమి – రాముడు భీముడు

yudhha bhumi ramudu bheemudu
ఈ రెండు సినిమాలు 1988 లో వచ్చాయి. కేవలం ఏడు రోజుల గ్యాప్ లో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాముడు భీముడు బాక్స్ ఆఫీస్ రికార్డు లను బద్దలు కొత్తగా, యుద్ధ భూమి సినిమా మాత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.