Ads
సినిమా కి టైటిల్ ఎంత ఇంపార్టెంట్ అన్న సంగతి తెలుసు కదా. సినిమా వైపు అట్ట్రాక్ట్ అయ్యేలా చేసే మొదటి పాయింట్ టైటిల్. టైటిల్ ని క్యాచీ గా పెట్టడమే కాదు.. వెంటనే జనం లోకి వెళ్లేలా పెట్టడం కూడా ముఖ్యమే. అయితే, కొన్ని సినిమాలకు మాత్రం ఏకం గా ఊరిపేర్లనే పెట్టేసారు. ఫలానా ఊరు అని అనగానే ఒకరకమైన బ్యాక్ గ్రౌండ్ మన మైండ్ లోకి వచ్చేస్తుంది. త్వరగా సినిమా కి కనెక్ట్ అయిపోతాం. అలా.. ఊరిపేర్లనే సినిమాలు గా పెట్టుకున్న ఇరవై మూవీస్ ను మనం ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
1. భీమిలి – నాని
నాచురల్ స్టార్ నాని హీరో గా వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. నాని లోని నాచురల్ యాంగిల్ ని ఈ సినిమా వెలికి తీసింది. నాని కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. భీమిలి ప్రస్తుతం భీముని పట్నం గా చలామణి అవుతోంది.
2. బెజవాడ – నాగ చైతన్య
బెజవాడ అనగానే ముందు గుర్తొచ్చేది రౌడీయిజం.. ఇక్కడ పౌరుషానికి కొదవుండదు. మరుగుతున్న రక్తం ఎంత పదును గా ఉంటుందో ఈ పేరులో కూడా అంత పవర్ ఉంటుంది. బెజవాడ అంటే ఊర మాస్ లెక్క. నాగచైతన్య మాస్ హీరో గా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ చేసిన సినిమా బెజవాడ. 1990 లలో జరిగిన వయొలెన్స్ ని కళ్ళకి కట్టినట్లు చూపించారు.
3. కులుమనాలి- శశాంక్, విమల రామన్
ఓ మనాలి ఓ మనాలి..చూసుకో జాలీ అంటూ చిన్నప్పుడు ఓ పాట విన్నాం గుర్తుందా..? కులు మనాలి ప్లేస్ మనకి తెలిసిందే. ఎంత చల్ల గా ఉంటుందో కొత్త గా చెప్పక్కర్లేదు. ఈ పేరునే విమల రామన్ థ్రిల్లర్ సినిమా కి పెట్టేసారు.
4. కేరాఫ్ కంచరపాలెం
విశాఖ వద్ద ఉండే కంచరపాలెం ఊరు పేరు చాలా మందికి తెలీదు. కానీ ఈ సినిమా వచ్చాక ఈ ఊరు పేరు మారు మ్రోగిపోతోంది. ఈ సినిమా చుసిన వాళ్ళకి ఈ ఊరుతో కూడా ఎమోషన్స్ ఉంటాయి.
5. హనుమాన్ జంక్షన్- జగపతి బాబు, అర్జున్
విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే రూట్ లో, గన్నవరం దాటాక వచ్చే జంక్షన్ హనుమాన్ జంక్షన్. ఈ జంక్షన్ లో పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆ రూట్ లో వెళ్లే ఎవరైనా.. అక్కడ ఆగి ఆయన్ను దర్శనం చేసుకునే వెళ్లారు. అక్కడ రోడ్ లు ఎంత పెద్ద గా వేసినా.. ఆ హనుమాన్ టెంపుల్ మీద ఈగ వాల్చలేకపోయారు. అది అక్కడి వాళ్ళ పవర్. ఈ పేరుతొ వచ్చిన మల్టీస్టార్ మూవీ హనుమాన్ జంక్షన్ కూడా హిట్ అయింది.
6. రేణి గుంట
తిరుపతి దగ్గర ఉండే ఊరు పేరు రేణిగుంట. ఈ ఊర్లో విమానాశ్రయం కూడా ఉంది. తిరుపతి కి ఎయిర్ వే లో వెళ్ళాలి అంటే రేణిగుంటకు వచ్చి వెళ్లాల్సిందే. తమిళ సినిమా ని తెలుగు లోకి డబ్ చేసి రేణిగుంట అని నేమ్ పెట్టారు.
7. అనంతపురం
తెలుగు రాష్ట్రాల్లో అనంత పురం అతిపెద్ద జిల్లా. ఈ పేరులోనే సంథింగ్ స్పెషల్. ఇక కలర్స్ స్వాతి హీరోయిన్ గా చేసిన ఈ సినిమా కూడా యూత్ కి నచ్చింది. “కొంటె చూపుతో..” సాంగ్ ఎంత ఫేమస్ అయిందో కొత్త గా చెప్పక్కర్లేదు.
8. బొంబాయి
అరవింద స్వామి హీరో గా నటించిన బొంబాయి సినిమా. బొంబాయి గురించి కొత్త గా ఏమి చెప్పక్కర్లేదు. ప్రెసెంట్ ముంబై గా పిలవబడుతున్న సిటీ ని బొంబాయి అని పిలిచేవారు. భారత్ లో ప్రముఖ మెట్రోపాలిటన్ సిటీస్ లో ముంబై కూడా ఒకటి.
9. అన్నవరం
పవన్ కళ్యాణ్ ని ఫామిలీ హీరో గా చూపిస్తూ, అన్నయ్య ప్రేమ ఎలా ఉంటుందో చూపించే సినిమా అన్నవరం. అన్నవరం మనకి తెలీని ప్లేస్ ఏమి కాదు. సత్యనారాయణ స్వామి వారు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం అన్నవరం. తెలుగు వారు వారి లైఫ్ టైం లో ఒక్కసారి అయినా అన్నవరానికి వెళ్లే ఉంటారు. కొత్తగా పెళ్లి అయినా వాళ్ల్లు కూడా ఇక్కడకు వెళ్లి స్వామి వారి సన్నిధి లో వ్రతం చేసుకుంటుంటారు.
10. ద్వారక – విజయ్ దేవర కొండ
ద్వారక అనగానే ముందు గుర్తొచ్చేది శ్రీ కృష్ణుడు జీవించిన చోటు అని. ద్వారక గుజరాత్ లో ఉంది. ఈ పేరు నే రౌడీ అన్న సినిమా కి పెట్టేసారు. ఓ దొంగని బాబా గా మార్చేసిన సినిమా ఇది.
11. గంగోత్రి – అల్లు అర్జున్
గల గల గంగోత్రి…. గుర్తుందా? అల్లు అర్జున్ తోలి సినిమా.. ఈ పేరు తో ఓ ప్లేస్ ఉంది. ఉత్తరాంఖండ్ లోని ఓ ప్లేస్ పేరుని ఈ సినిమా పేరు గా పెట్టేసారు.
12. అరుణాచలం – సూపర్ స్టార్
అరుణాచలం తమిళనాడు లోని ప్రాంతం. కానీ, అరుణాచలం అంటే మనకు గుర్తొచ్చేది సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా. ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు ఎలా ఖర్చుపెట్టాలో చూసాం కదా.ఆ అరుణాచలం శివుడిని, ఈ సూపర్ స్టార్ సినిమాని మర్చిపోలేం.
13. సింహాచలం – శ్రీహరి
రియల్ స్టార్ శ్రీహరి హీరో గా నటించిన సినిమా సింహాచలం. ఇందులో శ్రీహరి పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టేసారు. సింహాద్రి అప్పన్న అని తలుచుకోగానే గుర్తొచ్చేవి సింహాచలం, గిరి ప్రదక్షిణలు. సింహాచలం ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒకటి.
14. శ్రీశైలం -శ్రీహరి
రిపేర్లు సినిమా టైటిల్స్ గా పెట్టుకుని శ్రీహరి గారు హ్యాట్రిక్ కొట్టేసారు. శ్రీశైలం సినిమా లో ఆర్మీ ఆఫీసర్ గా దుమ్ము దులిపేసారు. శ్రీశైలం అందరికి తెలిసిన ప్రదేశమే. శ్రీ మల్లిఖార్జున స్వామి స్వయంభువు గా వెలసిన ప్రదేశం.
15. గోదావరి – సుమంత్
గలగలా పారే గోదారమ్మ తల్లి తీరాన నివసించే మనుషుల మనసులెంత స్వచ్ఛం గా ఉంటాయో.. ఈ సినిమా కూడా అంతే స్వచ్ఛం గా ఉంటుంది. మనసుకి హత్తుకునే సినిమా. మరి శేఖర్ కమ్ముల గారి సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి.
16. తెనాలి – కమలహాసన్
తెనాలి తెలియని తెలుగువాడుండడు. అలాగే కమల్ హాసన్ తెలియని భారతీయుడుండడు. అలా కమల హాసన్ హీరో గా నటించిన కామెడీ క్లియర్ మూవీ “తెనాలి”.
17. బద్రీనాధ్ – అల్లు అర్జున్
ఉత్తరాంఖండ్ లోని అందుమైన పవిత్ర ప్రదేశం బద్రీనాధ్. ఈ ప్లేస్ ను బేస్ చేసుకునే ఈ సినిమా ని తీశారు. అందులో మన బన్నీ నే హీరో గా నటించారు. అలకనంద గా తమన్నా యాక్ట్ చేసింది.
18. అయోధ్య – కృష్ణ, వడ్డే నవీన్
అయోధ్య అనగానే మనకి గుర్తొచ్చేది రామ జన్మ ప్రదేశమే. ఆ ప్లేస్ పేరు నే ఈ సినిమా కి పెట్టేసారు. కృష్ణ, వడ్డే నవీన్ ఈ సినిమా లో హీరోలు గా నటించారు.
19. కాశీ – జెడి చక్రవర్తి
కాశీ తెలీని వాళ్లెవరు ఉండరు. జీవితం లో పోయేలోపు ఒక్కసారి అయినా కాశీ కి వెళ్లాలని అనుకుంటారు. అలా కాశి పేరుతొ జెడి చక్రవర్తి హీరో గా ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ ని తీశారు.
20. భద్రాచలం – శ్రీహరి
భద్రాచలం అనగానే గుర్తొచ్చేది రాముల వారిచోటు. ఈ ప్లేస్ పేరుతొ తీసిన ఈ సినిమాలే శ్రీహరి హీరో. ఒకటే జననం, ఒకటే మరణం పాట గుర్తుండేవుంటుంది. ఆ పాట ఈ సినిమాలోది.
Also Check : Teddy Day Wishes To Brother and Sister
End of Article