25 కోట్లతో సాంగ్ షూటింగా….! ఇంత క్రేజ్ ఏంటి సామి…!

25 కోట్లతో సాంగ్ షూటింగా….! ఇంత క్రేజ్ ఏంటి సామి…!

by Mounika Singaluri

Ads

తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయంగా వెలిగిపోతుంది. ఆస్కార్ స్థాయిని కూడా తెలుగు సినిమా టచ్ చేసింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి చేరుకుంది. తెలుగు దర్శకులు హీరోలు కూడా ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా తమ సినిమాలను రూపొందిస్తున్నారు. యావత్ ప్రపంచం మొత్తం మన సినిమాల కోసం ఎదురుచూస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు మన సినిమా స్థాయి ఎక్కడ ఉందో…

Video Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా హీరో అయిపోయారు. పుష్ప మేనరిజమ్స్ గాని పుష్ప సాంగ్స్ గాని ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. క్రికెటర్స్ దగ్గర నుండి సామాన్యుల వరకు పుష్ప సినిమాని తమ ఓన్ చేసుకున్నారు.

pushpa2-telugu-adda

పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు ఇటీవల జాతీయ అవార్డు కూడా వచ్చింది. తొలి జాతీయ అవార్డు పొందిన తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇప్పుడు పుష్ప2 షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు సుకుమార్ పుష్పా ని మించిన విధంగా పుష్ప2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది.


మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 400 కోట్ల పైగానే ఈ సినిమాకి బడ్జెట్ కేటాయించినట్లుగా వినికిడి. జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో కీలకంగా వచ్చే జాతర పాట షూటింగ్ తెరకెక్కించారు. సుమారు 400 మంది డాన్సర్ లు ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నారు. రామోజీ ఫిలిం సిటీ లో మూడు భారీ సెట్లు ఈ సాంగ్ కోసం నిర్మించారు. సుమారు పది రోజులపాటు ఈ సాంగ్ షూటింగ్ జరిగింది.

ఏకంగా ఈ సాంగ్ కోసం చిత్ర యూనిట్ పాతిక కోట్లు ఖర్చు చేశారనేది ఇండస్ట్రీ టాక్. ఒక్క సాంగ్ కోసమే పాతిక కోట్లు ఖర్చు చేస్తే సినిమాని ఏ రేంజ్ లో తీస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఆగస్టు 15 2024న పుష్ప2 సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న రికార్డలను తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read:ఇలాంటి వాటి మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like