Ads
నందమూరి నటసింహం బాలయ్య బాబుకి ఉన్న ఫాలోయింగ్ మాములుగా ఉండదు. అఖండ సినిమా థియేటర్లలో ప్రసారం అవుతోంది. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వారిని ఎవరిని అడిగినా.. “జై బాలయ్య” అనే చెప్తారు. నందమూరి తారక రామారావు గారి తనయుడిగా బాలకృష్ణకి అవకాశాలు మాత్రమే వచ్చాయి.
Video Advertisement
కానీ, ఆయన ప్రతిభని మాత్రం ఆయనే నిరూపించుకుని ఈరోజు ఈ స్థాయిలో నిలిచారు. నటసింహం అన్న బిరుదుని కూడా సొంతం చేసుకున్నారు. ఆయన అరిచినా, కోప్పడినా కూడా అభిమానంగానే తీసుకునే వేలకొద్దీ అభిమానులను బాలయ్య సొంతం చేసుకున్నారు.
తింటే గారెలే తినాలి.. అలాగే బాలయ్య బాబు సినిమాను చూస్తే థియేటర్ లోనే చూడాలి. అంతటి అభిమానాన్ని, గ్రేస్ ని సంపాదించుకున్నారు బాలయ్య. అవసరమైన వారికి సాయం చేస్తూ రియల్ లైఫ్ లోను హీరోగా నిలిచారు. ఆయన కుడి చేత్తో సాయం చేస్తే.. ఎడమ చేతికి కూడా కూడా తెలియదు. అలాంటి సాయాలు ఎన్నో చేసారు. అందుకే ఫ్యాన్స్ కు ఆయన అంటే ప్రత్యేకం. ఆయన సినిమా థియేటర్ లో ప్లే అవుతోంది అంటే.. ఫ్యాన్స్ చెప్పే డైలాగ్స్ పై ఓ లుక్ వేయండి.
#1. అడవిలో పుడితే సింహంలా పుట్టాలి.. మరో జన్మలో బాలయ్య బాబులా పుట్టాలి.
#2. ఇండియా కి మోడీ.. ఇండస్ట్రీ కి బాలయ్య డాడీ.
#3. రాముడు, భీముడు, మా బాలయ్య బాబు దేవుడు..
#4. బాలయ్య బాబు మీద ప్రేమ చావదు. మరొకరి మీద ప్రేమ పుట్టదు.
#5. హైదరాబాదు, సికింద్రాబాద్
బాలయ్య బాబు జిందాబాద్
#6. ఒకటి, రెండు, మూడు
బాలయ్య బాబు ముందు ఎవడు?
#7. వర్షాకాలంలో కరెంటు కోత
అమ్మాయిల గుండెల్లో
బాలయ్య బాబు మోత
#8. మజా,ఫ్రూటీ
బాలయ్య బాబు నాటీ
#9. వాడెవ్వడు వీడెవ్వడు
బాలయ్య బాబు కు అడ్డెవ్వడు
#10. హాటు,స్వీటు
బాలయ్య బాబు సూటు
#11. మా బాలయ్య బాబు తోప్పు నీకు దమ్ముంటే ఆపు
#12. అయోధ్య లో రామయ్య మా ఆంధ్ర లో బాలయ్య
#13. ఈస్ట్ వెస్ట్ బాలయ్య బాబు బెస్ట్
#14. మేము తినేది ఉప్పు కారం
బాలయ్య బాబు మీద చావదు
మమకారం
#15. ఏసి, కూలర్
మా బాలయ్య బాబు రూలర్
#16. పాలకూర పప్పు బాలయ్య నిప్పు
#17. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్
బాలయ్య కొడితే హాస్పిటల్ బిల్స్
#18. ఇంట్లో ఉంది స్విమ్మింగ్ పూల్ బాలయ్య వాడే వర్డ్ బ్లడీ ఫూల్
#19. వాటర్,క్వార్టర్
బాలయ్య బాబు డిక్టేటర్
#20. బిగ్ హౌస్ స్మాల్ హౌస్.. బాలయ్య బాబు మాన్షన్ హౌస్..
#21. వన్, టు, త్రి.. బాలయ్యబాబు కంత్రి..
#22. ఊపు, గ్రూపు మా బాలయ్య బాబు తోపు
#23. వన్, టు, త్రి, ఫోర్.. బాలయ్యబాబు నెవెర్ బిఫోర్..
#24. జిల్ జిల్ జిగా.. మా బాలయ్యబాబు సెగ..
#25. అర్జున ఫాల్గుణ.. మా బాలయ్యబాబు ది సింహ గర్జన
#26. స్మోకింగ్ ఈజ్ ఇంజ్యురియాస్.. బాలయ్యబాబు ఈజ్ డేంజరస్..
#27. స్టెతస్కోప్ తో వచ్చేది లబ్ డబ్..
మా బాలయ్యబాబుతో పెట్టుకుంటే అవుతారు గబ్బు గబ్బు
#28. కార్ లోన్, బైక్ లోన్ .. బాలయ్యబాబు సైక్లోన్..
#29. బొంగు రింగు.. బాలయ్యబాబు కింగ్..
#30. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే.. జై బాలయ్య
End of Article