ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా బాగానే హిట్ అవుతున్నాయి. భారీగా సినిమా ని తీసుకు రావలసిన అవసరం లేదు. నిజానికి చాలా మంది పెద్ద పెద్ద సినిమాలని కొన్ని వేల కోట్ల రూపాయలని ఖర్చు చేసి తీస్తున్నారు. అయినా కూడా ఆ సినిమాలు హిట్ అవడం లేదు. నిజానికి ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. పైగా సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు గొప్ప నటులు ఉండాల్సిన పని కూడా లేక పోయింది.

Video Advertisement

కాస్టింగ్ తో పని లేకుండా బడ్జెట్ తో పని లేకుండా కూడా సినిమాలు హిట్ అయిపోతున్నాయి. రోమాంచం సినిమా కూడా అలానే హిట్ అయింది.

సినిమా చూసే వాళ్ళు మంచి కంటెంట్ కోసం సరైన కంటెంట్ కోసం చూస్తున్నారు తప్ప సినిమాలో నటించే నటీ నటుల గురించి కానీ సినిమా బడ్జెట్ గురించి కానీ చూడడం లేదు. మంచి కంటెంట్ ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తున్నారు. ఎంత పెద్ద పెద్ద స్టార్లు సినిమా లో నటిస్తున్నా కథ నచ్చక పోతే సినిమాని చూడడం లేదు. తమిళ్ లో వచ్చిన లవ్ టుడే కూడా అలాంటి సినిమా ఏ. అలానే తెలుగులో వచ్చిన పెళ్లి చూపులు సినిమా కూడా అటువంటిదే.

కన్నడ లో వచ్చిన కాంతారా సినిమా కూడా సక్సెస్ ని అందుకుంది. మలయాళం లో అయితే రోమాంచం వచ్చి చేరింది ఇప్పుడు. సౌబిన్ షాహిర్, అర్జున్ అశోకం, సాజిన్ గోపు, సిజు సన్నీ, అబిన్ బినో తదితరులు ముఖ్య పాత్రలు చేసారు.  ఈ మూవీ ని రెండు కోట్ల బడ్జెట్ తో తెర మీద కి తీసుకు రాగా 50 కోట్లకు పైగా సినిమా వసూలు చేసింది. ఇప్పటికి కూడా మంచి కలెక్షన్స్ ఈ సినిమా కి వస్తున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెలుగు తమిళ నిర్మాతలు చూస్తున్నారు.