7.11 PM Movie OTT: సడన్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ తెలుగు సినిమా చూసారా.?

7.11 PM Movie OTT: సడన్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ తెలుగు సినిమా చూసారా.?

by kavitha

Ads

7.11 PM Movie: తెలుగు సినిమాలలో  సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన చిత్రాలు తక్కువగా వచ్చాయని చెప్పవచ్చు. అందులో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. వేళ్ళ పై లెక్కించగల సంఖ్యలో ఉంటాయి.

Video Advertisement

నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369, సూర్య  నటించిన 24, శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ లాంటి చిత్రాలు విజయాలు సాధించాయి. ఇటీవల టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘7:11 పీఎం’ రిలీజ్ అయ్యింది. మరి ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
సాహస్ పగడాల, దీపికా రెడ్డి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘7:11 పీఎం’ జులై 7న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, హంసలదీవి అనే గ్రామంలో 1999 సంవత్సరంలో రవి ప్రసాద్ (సాహస్) ఆటో గ్యారేజ్‌లో పని చేస్తూ, ఐపీఎస్ సాధించాలని సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. రవి, విమల (దీపికా రెడ్డి) ప్రేమించుకుంటారు. రాజేశ్ అనే వ్యక్తి, స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ ఒక  ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ ఊరిలోని ప్రజలందరిని మోసం చేయడానికి రెడీ అవుతాడు.
ఆ మోసాన్ని తెలుసుకున్న రవి అతన్ని అడ్డుకొనే ప్రయత్నంలో అనుకోకుండా ఒక బస్సు ఎక్కుతాడు. నిద్ర లేచే సరికి రవి మెల్‌బోర్న్‌లో ఉంటాడు. అక్కడ కాలం 2024 లో నడుస్తూ ఉంటుంది. అసలు ఆ ఊరికి టైమ్‌ మిషన్‌ ఎలా వచ్చింది? రవి ఎందుకు ఆ టైమ్‌ మిషన్‌ ఎక్కాల్సి వచ్చింది? అతను తిరిగి తన కాలానికి వెళ్లాడా? తాను ప్రేమించిన విమలను కలిశాడా లేదా? అనేదే మిగిలిన కథ.
7.11 PM Movie Storyడైరెక్టర్ చైతూ మాదాల సెలెక్ట్ చేసుకున్న పాయింట్‌ కొత్తగా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అయితే ఆ పాయింట్‌ను కథగా చెప్పడంలో తడబాటు కనిపిస్తుంది. అయితే మొదటి సినిమా దర్శకుడిగా స్టోరీని డీల్ చేసిన తీరు, పలు క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు బాగుంది. పాత్రల్లో సహజత్వం కనిపిస్తుంది. హీరో సాహస్ చక్కటి నటనను ప్రదర్శించాడు.  హీరోయిన్ దీపిక పాత్ర పరిధి మేరకు నటించింది.

Also Read: థియేటర్‌లోకి వచ్చిన 2 నెలలకి ఓటీటీలో స్ట్రీమింగ్..! ఇంతకీ ఆ సినిమా ఏదంటే..?


End of Article

You may also like