మన 7 తెలుగు హీరోలు నటించిన ఈ సినిమా ఏమిటో తెలుసా..?

మన 7 తెలుగు హీరోలు నటించిన ఈ సినిమా ఏమిటో తెలుసా..?

by kavitha

Ads

ఇటీవల రిలీజ్ అయిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ స్టార్ రజినికాంత్ ప్రధానపాత్రలో నటించగా, ఇతర ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్లు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్ గెస్ట్ పాత్రలలో మెరిసిన విషయం తెలిసిందే.

Video Advertisement

వీరిలో శివరాజ్ కుమార్ రోల్ చేసిన రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే టాలీవుడ్ 7 స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించి, అభిమానులను అలరించారు. మరి ఆ సినిమా ఏమిటో? ఆ సినిమాలో హీరో ఎవరో? ఆ స్టార్ హీరోలేవరో ఇప్పుడు చూద్దాం..సాధారణంగా సినిమాలో స్టార్ హీరోతో పాటు మరో స్టార్ హీరో కనిపిస్తేనే భారీగా అంచనాలు ఏర్పడతాయి. తమ అభిమాన హీరో మరో హీరో మూవీలో అతిథి పాత్రలో కనిపించాడంటే ఆ హీరో ఫ్యాన్స్ చేసే హడావుడి మామూలుగా  ఉండదు. టాలీవుడ్ లో మల్టీస్టారర్లు ఇప్పుడు కొత్త కాదు. సీనియర్ ఎన్టీఆర్-ఏఎన్నార్ నుంచి జూనియర్ ఎన్టీఆర్- రామ్‌చరణ్ వరకు అడపాదడపా మల్టీస్టారర్ చిత్రాలు ఆడియెన్స్ అలరిస్తున్నాయి. అయితే 1987 లో అతిపెద్ద మల్టీస్టారర్ వచ్చింది. కానీ సినిమా అంతా మల్టీస్టారర్ కాదు. ఒక సాంగ్ వరకు మాత్రమే.  1987లో వెంకటేశ్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’ మూవీలో ‘ఒకే మాట ఒకే బాట’ అనే సాంగ్ లో అప్పటి స్టార్ హీరోలు, హీరోయిన్లు సందడి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, తదితర హీరోలు కనిపించారు. ఇక ఈ హీరోలతో పాటు అప్పటి టాప్ హీరోయిన్లు రాధిక, విజయశాంతి, రాధ, భానుప్రియ, సుమలత వంటి హీరోయిన్లు కనిపించారు.
వీరితో పాటు చంద్రమోహన్, మురళీమోహన్, కోడి రామకృష్ణ, విజయనిర్మల, శారద, జయమాలిని వంటి యాక్టర్స్ కూడా ఈ పాటలో తళుక్కున మెరిసి అభిమానులని అలరించారు. ప్రస్తుతం ఈ క్రేజీ మల్టీస్టారర్ సాంగ్ కి సంబంధించిన వీడియో క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/reel/Cv_g-LTpfDu/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: బాహుబలి లాంటి సినిమాలని మించిన కథ..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?


End of Article

You may also like