Ads
సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ వయసుతో సంబంధం లేదు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను సమయస్ఫూర్తితో పోరాడుతూ ముందుకు సాగిపోవాలి. తన కూతురికి ఎదురైన సమస్యలను వేళ్ళతో సహా పీకి పారేయడానికి ఈ వృద్ధ జంట నడుంబిగించింది. వీరు చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఒక స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైంది. భావితరాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
Video Advertisement
సూరత్ కి చెందిన రాధాకృష్ణ మరియు శకుంతల దంపతులు దాదాపు 50 ఏళ్ల పాటు కుటుంబ వ్యాపార వ్యవహారాలను చూసుకునే 2010లో రిటైర్ అయ్యారు.
ఈ చౌదరి దంపతుల కుమార్తె జుట్టు బాగా ఓడిపోయి అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు ఉండటం అనేది తగ్గటం లేదు. ఆమె మనసులో వేదనను తల్లిదండ్రులతో వెల్లడించింది. కూతురి బాధని చూడలేని ఆ వృద్ధ దంపతులు దాదాపు సంవత్సరం పాటు ఆ జుట్టు ఉండటానికి గల కారణాలు ఏంటి? ఎందువలన ఈ విధంగా జరుగుతుంది అని వెబ్ సైట్స్ లో పరిశోధించడం మొదలుపెట్టారు. ఎన్నో అధ్యయనాలు చేశారు.
స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్స్ స్థాయిల అసమతుల్యత వలన ఈ విధంగా జరుగుతుంది అని గ్రహించారు. ఈ హార్మోన్ సక్రమంగా పనిచేయడం కోసం ఇంటర్నెట్ లో అనేక విషయాలను శోధించి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. వారే సొంతంగా ఆయిల్ తయారు చేయడానికి నడుం బిగించారు. అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఆముదం, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇలా 50 రకాల మూలికలు ఉపయోగించి హెయిర్ ఆయిల్ తయారు చేశారు. ఇలా తయారు చేసిన నూనెను తన కుమార్తెకు ఇవ్వగా, ఆమె జుట్టు ఊడటం ఆగిపోయి ఒత్తుగా పెరగడం మొదలైంది.
తమ సన్నిహితులు కూడా ఇచ్చి వాడమని చెప్పారు. మూడు నెలల పరిశోధన అనంతరం హెయిర్ ఆయిల్ వాడిన వారికి ఫలితాలు రావడంతో అవిమీ హెర్బల్ పేరుతో హెయిర్ ఆయిల్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. 85 సంవత్సరాల వయస్సులో కూడా మనిషి సాధ్యంకానిది ఏమీ లేదంటూ ఈ తరానికి ఆదర్శంగా నిలిచారు ఈ వృద్ధ జంట.
End of Article