Ads
ఈ మధ్య తెలుగు సినిమాలు టైటిల్స్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అచ్చ తెలుగు లో పెద్ద టైటిల్స్ ఉండడం.. టైటిల్ చూడగానే క్యూరియాసిటీ కలిగేలా దర్శక నిర్మాతలు చూసుకుంటున్నారు. ఓ సినిమా కి కధ, కధనం, నటి నటులు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియనిది కాదు. మరో వైపు ఆ స్టోరీ కి పెట్టె టైటిల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే.. సినిమా చూడాలి అన్న ఆసక్తిని మొదట రేకెత్తించేది ఆ టైటిల్ కాబట్టి. అందుకే ఈ విషయం లో మరింత జాగ్రత్త గా ఆసక్తికరం గా ఉండే టైటిల్స్ ని ఎంచుకుంటున్నారు. ఆ మూవీస్ ఏంటో ఓ లుక్ వేయండి..
Video Advertisement
#1 అయినను పోయి రావలె హస్తినకు:
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో లో “అయినను పోయి రావలె హస్తినకు” టైటిల్ తో సినిమా రాబోతోంది. టైటిల్ అనౌన్స్మెంట్ తో ఈ సినిమా పై క్యూరియాసిటీ అమాంతం పెరిగిపోయింది.
#2 లైగర్
పూరి , విజయ్ దేవరకొండ కాంబో లో రాబోతున్న ఈ మూవీ టైటిల్ రివీల్ చేసిన రోజు సోషల్ మీడియా లో ఎంత హంగామా అయిందో మనందరికి తెలుసు.
#3 మిస్ శెట్టి& మిష్టర్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కాంబో లో వచ్చే సినిమా దాదాపు కంఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. అయితే అఫిషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
#4 18 పేజెస్:
అనుపమ, నిఖిల్ కాంబో లో ఈ మూవీ రాబోతోంది. టైటిల్ కూడా ఇంటరెస్టింగ్ గా ఉంది కదా.
#5 ఐకాన్:
అల్లు అర్జున్ హీరో గా నటించనున్న సినిమా ఐకాన్. హీరో టైటిల్ కార్డు ని మూవీ నేమ్ గా పెట్టడం ఇదే మొదటిసారి అనుకుంట.
#6 హరిహర వీరమల్లు:
పవర్ స్టార్ రీ ఎంట్రీ ఇచ్చాక ఆయన ఎంచుకునే మూవీస్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. ఆ మూవీస్ ఓ మూవీ టైటిల్ “హరిహర వీరమల్లు”. ఈ సినిమాలో హీరో గెటప్ కూడా డిఫరెంట్ గానే ఉంది. మొత్తానికి క్యూరియాసిటీ మాత్రం పెరిగిపోతోంది.
#7 అంటే సుందరానికి..:
ఎదో చెప్పాలి అని మొదలుపెట్టి ఆపేసినట్లు ఉంది కదా ఈ టైటిల్. నాని నటిస్తున్న మూవీ కి “అంటే..సుందరానికి..” అన్న టైటిల్ ని పెట్టారు.
#8 బింబిసార:
కళ్యాణ్ రామ్ హీరో గా.. హిస్టారికల్ మూవీ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా రాబోతోంది. కళ్యాణ్ రామ్ చాలా సర్ప్రైజింగ్ గా ఈ టైటిల్ ని ఫస్ట్ లుక్ ని రివీల్ చేసారు.
#9 మహా సముద్రం:
శర్వానంద్ హీరో గా రాబోతున్న సినిమా “మహా సముద్రం”. టైటిల్ దగ్గరనుంచి ఈ సినిమా నుంచి వస్తున్న అప్ డేట్స్ అన్ని క్యూరియాసిటీ రేకెత్తిస్తున్నాయి.
End of Article