Ads
వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మల్టి స్టారర్ మూవీ “గోపాల గోపాల”. ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, శ్రియ శరణ్ భార్యా భర్తలుగా నటించిన సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ సినిమాలో శ్రియ దేవుడిపై నమ్మకం ఉన్న భక్తురాలిగా కనిపిస్తారు. మరో వైపు వెంకీ మామ నాస్తికుడిగా కనిపిస్తారు. వెంకటేష్ కు దేవుడు ఉన్నాడు అని భావిస్తాడు కానీ.. గుడ్డిగా ఆచారాలు పాటించే వాళ్లంటే గిట్టదు. కానీ, దేవుడి ఫోటోలు అమ్మే వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఓ సారి పిడుగు పడి షాపు కాలిపోతుంది. ఆ సమయంలో వెంకటేష్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కోర్ట్ లో కేసు వేసి తనకు జరిగిన నష్టానికి దేవుడే బాధ్యుడని.. ఇలాంటి నష్టాలకి ఇన్సూరెన్స్ ను హిందూ ధార్మిక సంస్థలే చెల్లించాలని ఫిర్యాదు లో పేర్కొంటారు.
అలాంటి కష్టాలు ఎదుర్కొంటున్న టైంలోనే శ్రీ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్లు.. వెంకటేష్ తో పాటు ఇంట్లోనే ఉంటూ వెంకటేష్ కు మార్గదర్శకం చేస్తాడు. ఈ టైములో ఓ సన్నివేశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ టివి లో మాయాబజార్ సినిమాను చూస్తూ ఉంటాడు. అది మొదటి సీన్ లో బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. తరువాత సీన్ వచ్చేసరికి కలర్ లోకి వచ్చేస్తుంది. బహుశా.. ఈ సీన్ ను రెండు సార్లు షూట్ చేసి ఉండడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు.
ఇప్పటికే ఈ సినిమా టీవీ లో చాలా సార్లు వేశారు కూడా.. ఇప్పటికీ వేసినప్పుడల్లా చాలా మంది ఈ సినిమా ను చూస్తూనే ఉంటారు. ఈ సినిమా ను ఇన్ని సార్లు చూసినా మనం ఈ మిస్టేక్ ని గమనించలేదు. ఇవి సినిమా కి పెద్ద గా ఎఫెక్ట్ చేయకపోయినా.. కానీ డైరెక్ట్ చేసేటపుడు వీటిని అంతగా పట్టించుకోలేదని తెలుస్తుంది. దీనివల్ల సినిమా కథ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కాకపోతే కొన్ని పొరపాట్లు తెలియకుండా జరుగుతుంటాయంతే.
End of Article