Ads
శేఖర్ కమ్ముల సినిమాలే కాదు మనసు కూడా క్లాసి గానే ఉంటుంది. లవ్ స్టోరీ సినిమా విజయం తో ఫుల్ కుష్ లో ఉన్న డైరెక్టర్ శేఖర్ కమ్ములను తాజాగా నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. కారణం ఏమిటంటే.. ఆయన ఓ రైతు కుటుంబానికి అండగా నిలిచారట. రీసెంట్ గా సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో ఓ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Video Advertisement
ఈ ప్రమాదం లో కప్పల లక్ష్మయ్య అనే ఓ రైతు ఇల్లు అగ్నికి ఆహుతైంది. అంతేకాదు.. ఆయన బీరువాలో దాచుకున్న ఆరు లక్షల రూపాయలు కూడా దగ్ధం అయ్యాయి. దీనితో అతని వేదన వర్ణనాతీతంగా ఉంది. సోషల్ మీడియాలో అతని గురించి తెలుసుకున్న శేఖర్ కమ్ముల అతనికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతని కుటుంబంతో మాట్లాడి.. తక్షణ సాయంగా లక్ష రూపాయలను పంపించారు. దీనితో.. శేఖర్ కమ్ముల చేసిన పనికి నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.
End of Article