టాప్ పొజిషన్ లో ఉండగా అకాలంగా మరణించిన 4 స్టార్ హీరోలు వీరే..! కన్నడ చిత్రపరిశ్రమకు ఇది శాపమా.?

టాప్ పొజిషన్ లో ఉండగా అకాలంగా మరణించిన 4 స్టార్ హీరోలు వీరే..! కన్నడ చిత్రపరిశ్రమకు ఇది శాపమా.?

by Megha Varna

Ads

కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. నిన్నటి వరకు మనతో ఉన్న వ్యక్తి భవిష్యత్తులో మనతోనే ఉంటారో లేదో చెప్పలేం. సినిమా సెలబ్రిటీలు మనకి వ్యక్తిగతంగా పరిచయం ఉండరు. అయినా సరే వాళ్లు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎవరో మన సొంత వాళ్ళు మనకి దూరం అయినట్టు అనిపిస్తుంది.

Video Advertisement

ఎంతో మంది సినీ తారలు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన, లేదా చెడు అలవాట్ల వలన, లేదా ప్రమాదాల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అలా కొంత మంది టాప్ స్థానంలో ఉన్న కన్నడ నటులు కూడా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వారందరూ కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడి, కన్నడ సినిమా ఇండస్ట్రీలో టాప్ స్థానం సంపాదించుకున్న నటులు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 విష్ణువర్ధన్:

కన్నడ మెగాస్టార్ గా పాపులర్ అయిన విష్ణువర్ధన్ 200కు పైగా చిత్రాల్లో నటించారు. కేవలం 59 సంవత్సరాలకే గుండె పోటుతో హీరో విష్ణు వర్ధన్ మరణించడం జరిగింది.

#2 శంకర్ నాగ్:

పాపులర్ స్టార్ హీరో అయిన శంకర్ నాగ్ కూడా హఠాత్తుగా చనిపోయారు. ఈ హీరో మరణించిన 4 సంవత్సరాల వరకు కూడా తన చిత్రాలు విడుదలయ్యాయి. కన్నడ పరిశ్రమలో ఒక హీరోకి ఒక పెద్ద రేంజ్ ఉంది. కానీ శంకర్ నాగ్ కారు నడుపుతూ ప్రమాదానికి గురై మృతి చెందారు.

#3 చిరంజీవి సర్జా:

గుండె పోటుతో చిరంజీవి సర్జా మృతి చెందడం అభిమానుల్ని ఎంతగానో బాధించింది. కన్నడ పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్నా చిరంజీవి సర్జా మరణం తో అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఇలా కన్నడ స్టార్లు హఠాత్తుగా మరణించడం అనేది బాధాకరం.

#4 పునీత్ రాజ్ కుమార్

అటు హీరోగా సినిమాల్లో నటించడం… ఇటు ప్రజలకు సేవ చేయడం నిజంగా గొప్ప విషయం. కానీ హఠాత్తుగా పునీత్ కి గుండె పోటు రావడం, తుది శ్వాసని విడిపెట్టడం నిజంగా బాధాకరం. అయితే కన్నడ సినిమా ఇండస్ట్రీ లో మంచి పేరు పొందిన నటులు అకాల మరణం చెందడం ఇది మొదటిసారి. కాదు. గతం లో కూడా మంచి స్టార్ హీరోలుగా పాపులర్ అయిన పలువురు స్టార్స్ మరణించడం జరిగింది.


End of Article

You may also like