Ads
అన్ని సినిమాలు హిట్స్ అవ్వవు. కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అవుతూ ఉంటాయి. అయితే హీరోని రిజెక్ట్ చేసిన కథని మరొక హీరో చేయడానికి ఆసక్తి చూపించరు.
Video Advertisement
హీరో వెంకటేష్ సినీ కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఆ హిట్లలో శత్రువు సినిమా కూడా ఒకటి. దాని కంటే ముందు వచ్చిన సినిమాలు అంత పెద్ద హిట్స్ ని తీసుకురాలేదు. శోభన్ బాబు నటించాల్సిన ఒక సినిమాని ఆయన రిజెక్ట్ చేస్తే ఆ కధ ఆఖరికి వెంకటేష్ కి చేరింది. అయితే వెంకటేష్ ఆ చిత్రానికి ఓకే చెప్పేశారు.
శోభన్ బాబు రిజెక్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నిర్మాత ఎమ్మెస్ రాజు కి ఇది తొలి సినిమా. శత్రువు కధని ఎమ్మెస్ రాజు వ్రాయగా కథ రాసిన వెంటనే శోభన్ బాబు నటిస్తే బాగుంటుందని అనుకున్నారు. కధ నచ్చింది కానీ ఈ సినిమాలో నటించనని శోభన్ బాబు చెప్పారు. అదే విధంగా సినిమాలకి బదులుగా ఏదైనా వ్యాపారం చేసుకోమని శోభన్ బాబు ఆయనకి సూచించారు.
ఈ సినిమాలో నటించడం వల్ల మనస్పర్థలు వస్తాయని అందుకే నటించలేనని శోభన్ బాబు చెప్పారు. ఆ తర్వాత ఈ కధని వెంకటేష్ దగ్గరికి తీసుకువెళ్లి ఒప్పించి అందులో నటించేలా చేయడం జరిగింది. శోభన్ బాబు రిజెక్ట్ చేసిన ఈ సినిమా వెంకటేష్ కి హిట్ ఇచ్చింది. రాజ్ కోటి ఈ చిత్రానికి సంగీతం అందించారు. కోడిరామకృష్ణ దర్శకుడిగా పనిచేశారు.
End of Article