“ఆర్ ఆర్ ఆర్” లో నటిస్తున్న ఒలీవియా మోరిస్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా..? సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారంటే?

“ఆర్ ఆర్ ఆర్” లో నటిస్తున్న ఒలీవియా మోరిస్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా..? సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారంటే?

by Anudeep

Ads

రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ టాలీవుడ్ తో పాటుగా యావత్ సినీ లోకం మొత్తం కళ్ళు ఈ సినిమా మీదనే ఉన్నాయి.

Video Advertisement

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్న సినిమా. అయితే.. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ లతో పాటు.. హాలీవుడ్ తార ఒలీవియా మోరిస్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

olivia 1

హాలీవుడ్ తార కావడంతో ఒలీవియా మోరిస్ పై కొంచం ప్రత్యేకమైన ఆసక్తే నెలకొంటోంది. ఇటీవల విడుదల అయిన “నాటు నాటు” సాంగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మాస్ స్టెప్పులతో పాటు ఒలీవియా కూడా ప్రధాన ఆకర్షణగా కనిపించారు. చాలా మంది సినిమాలో ఒలీవియా ఎలా కనిపిస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఒలీవియా బ్యాక్ గ్రౌండ్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

olivia 2

ఒలీవియా 1997 లో లండన్ లో జన్మించారు. చిన్నతనం నుంచే బామ్మ దగ్గర పెరిగింది. అప్పటినుంచే ఆమెకు సినిమా, టివి, ఫిలిం రంగాల పట్ల ఆసక్తి ఉండేది. స్కూల్ లో ఉన్న రోజులలోనే ఆర్టీఏ లెవెల్ లో ట్రైనింగ్ తీసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు యాక్టింగ్ టీచర్ గా కూడా పని చేసారు. లండన్ లోనే రాయల్ వెల్ష్ మ్యూజిక్ అండ్ డ్రామా కాలేజీ లో డిగ్రీ కూడా పూర్తి చేసారు.

olivia morris

తరువాత టివి వైపు వచ్చారు. కేవలం ఏడు రోజుల్లో మినీ అడ్వెంచర్ టీవీ సిరీస్ ను పూర్తి చేసారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కంటే ముందు ఒలీవియా మోడలింగ్ ను తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నారు. ఒలీవియా తన వృత్తిలో భాగంగా కొన్ని క్లాసిఫైడ్ యాడ్‌లలో కనిపించేవారు. ఆమె లండన్‌లోని నేషనల్ యూత్ థియేటర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌లో 2015 లోనే యాక్టింగ్ స్కిల్స్ ను నేర్చుకున్నారు.

olivia 3olivia 3

ఒలీవియా ” 3 సిస్టర్ ” అనే నాటికలో థియేటర్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ స్టార్ట్ చేసారు. కాలేజీ లో కూడా రకరకాల నాటికల్లో ఆమె పార్టిసిపేట్ చేసేవారు. “‘ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ సీరియస్” అనే నాటికలో 2017 లో నటించారు. ఆ నాటికలో ఆమె సిసిలీ కార్డ్యూ పాత్రను పోషించారు. ఆమె లండన్ ఫ్యాషన్ వీక్‌తో సహా అనేక ఫ్యాషన్ వీక్ రాంప్ షోలలో పాల్గొన్నారు. ఇంగ్లీష్ మ్యూజిక్ వీడియో ఫెర్రిస్ మరియు సిల్వెస్టర్ లండన్ బ్లూస్‌ లో కూడా ఒలీవియా కనిపించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడానికి ఎంపిక అయ్యింది. ఈ సినిమా విడుదల అయ్యాక ఒలీవియా ను తెరపై చూడచ్చు.

 


End of Article

You may also like