263
శుక్రవారం రోజున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏడ్చేసిన సంగతి తెలిసిందే. తిరిగి సీఎం అయ్యే వరకు ఆయన అసెంబ్లీ లో కూడా అడుగు పెట్టను అంటూ శపధం కూడా చేసారు.
అయితే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయాన్నీ కూడా ప్రమోషన్ గా వాడేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసారు. ఆర్జీవీ ఇటీవలే “పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్” ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..
ఈ ట్రైలర్ ను చూసే చంద్రబాబు నాయుడుగారు ఏడ్చేశారు అంటూ ఆర్జీవీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏ అవకాశాన్ని అయిన వర్మ తన ప్రమోషన్ కు వాడేసుకోగలరు అంటూ నెటిజన్స్ స్పందిస్తున్నారు.

