Ads
ఇక బిగ్ బాస్ సీజన్ 5 ఎండింగ్ కి వచ్చేస్తోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒకరు ఈరోజు ఎలిమినేట్ అయిపోతారు. మిగిలిన ఐదుగురు మాత్రం ఫినాలేకి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది ఏమిటంటే..? డిసెంబర్ 19న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే ఎపిసోడ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఫినాలే ఎపిసోడ్ ని ఒక రేంజ్ లో నిర్వహించినట్లు ఈసారి కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది.
Video Advertisement
బిగ్ బాస్ షో ని ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉన్నా.. షో ముగింపుకి వచ్చేసరికి విన్నర్ ఎవరు కాబోతున్నారు అనే విషయం పట్ల కొంత క్యూరియాసిటీ కనబరుస్తారు.
ఈ క్రమంలో ఈసారి విన్నర్ ఎవరు అన్న విషయమై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో రకరకాల కధనాలు వస్తున్నాయి. ఈ కధనాల ప్రకారం రవి, సన్నీ, శ్రీ రామచంద్ర కంటెస్టెంట్ లుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రేసులో అనీ మాస్టర్ కూడా ఉండే అవకాశం ఉందని భావించినా.. ఆమె గతవారం ఎలిమినేట్ అయిపోవడంతో.. రేసు నుంచి తప్పుకున్నట్లు అయింది. సన్నీ బిగ్ బాస్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
సన్నీ ఎంతో నిజాయితీగా గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ నిలబడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి విన్నర్ రేసులో షణ్ముఖ్ కూడా ఉన్నప్పటికీ ఆయన ప్రవర్తన వలన ఈ రేసు నుంచి దూరం అవుతున్నారు. ఈ క్రమంలో సన్నీ నే విన్నర్ అయ్యే అవకాశం ఉందని కధనాలు పేర్కొంటున్నాయి.
End of Article