RRR: “నాటు నాటు” సాంగ్ గురించి ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ విన్నారా? ఆ ఒక్క స్టెప్ కోసం..!

RRR: “నాటు నాటు” సాంగ్ గురించి ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ విన్నారా? ఆ ఒక్క స్టెప్ కోసం..!

by Anudeep

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఇటీవల విడదలయ్యి ట్రెండింగ్‌లో ఉంది.

natu natu

ఈ సాంగ్ షూటింగ్ స్టేజి లో ఉన్న విషయం గురించి ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ ని షూట్ నచ్చకపోతే.. రాజమౌళి వెంటనే రీటేక్ అనేవారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ లో నాటు నాటు స్టెప్ కోసమే ఏకంగా 15 నుంచి 18 టేక్ లు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అసలు ఈ స్టెప్ పై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఆ బీట్ కి తగ్గట్లు రామ్ చరణ్ వి, నావి మూవ్మెంట్స్ సింక్ అవ్వాలి అని.. అన్నిసార్లు రాజమౌళి గారు ఎందుకు రీటేక్ లు తీయించారో ఇప్పుడు అర్ధం అవుతోందని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like