Ads
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ కి పెద్దన్నగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చే వారిని ఎంకరేజ్ చేయడం, పరిశ్రమకు ఇబ్బందులు ఎదురైతే స్పందించి తన వంతు సాయం చేయడం వంటివి చేస్తున్నారు.
Video Advertisement
తాజాగా ఆయన యంగ్ హీరో కార్తికేయ వివాహానికి కూడా చిరంజీవి హాజరు అయ్యి ఆశీర్వదించారు. ఈ విషయమై హీరో కార్తికేయ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు.
కార్తికేయ మెగాస్టార్ కి వీరాభిమాని. చిన్నప్పుడు తానూ హీరో అవ్వాలని కలలు కన్నాడు. తన పెళ్ళికి కూడా మెగాస్టార్ వస్తారని చిన్నప్పుడే ఊహించేసుకున్నాడు. అయితే.. ఎట్టకేలకు అతని కల నిజమైంది. ఇటీవలే తన్న చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న కార్తికేయ.. వివాహానికి మెగాస్టార్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.
End of Article