Ads
శివశంకర్ మాస్టర్ అందరికి నటుడిగానే.. జడ్జిగానే తెలుసు. ఆయన ఓ అద్భుతమైన నృత్య దర్శకుడు అని సినిమా పరిశ్రమకి మాత్రమే తెలుసు. ఆయన లేని లోటుని ఈ సినీ పరిశ్రమ పూడ్చలేదు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శివ శంకర్ మాస్టార్ నిన్న రాత్రి శివైక్యం చెందారు.
Video Advertisement
క్లాస్ అయినా మాస్ అయినా స్టెప్పులు వేయించగలగడం శివ శంకర్ మాస్టర్ ప్రత్యేకత. మన్మధ రాజా అంటూ మనోజ్ తో మాస్ స్టెప్పులు వేయించినా.. ధీర ధీర అంటూ రామ్ చరణ్ తో క్లాస్ స్టెప్స్ వేయించినా ఆయన శైలే వేరు.
డిసెంబర్ 7 , 1948 లో జన్మించిన శివ శంకర్ మాస్టర్ చిన్నతనంలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనకు తొమ్మిదిమంది అక్కలు ఉన్నారు. వారిలో ఒకరు ఒళ్ళో కుర్చోపెట్టుకున్న సమయంలో వారి ఇంటివైపు ఓ ఆవు వచ్చింది. దానిని చూసి భయపడి ఆవిడ లేచి పరిగెత్తబోయింది. ఈ క్రమంలో ఒళ్ళో ఉన్న ఏడాది వయసున్న శివశంకర్ మాస్టర్ కింద పడిపోయారు. దీనితో ఆయన వెన్నెముక విరిగింది. సర్జరీ చేసాక.. దాదాపు 8 ఏళ్ల చికిత్స తర్వాత కానీ ఆయన అడుగులు వేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితిలో ఆయన డాన్స్ మాస్టర్ అవుతారని ఎవరైనా కలగంటారా..?
వెన్నెముక గాయం వలన మాస్టర్ చాలా కాలం పాటు ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. దానితో.. ఆయన పేరెంట్స్ ఆయనను బాగా గారాబం చేసేవారు. ఆయన తండ్రి కల్యాణ సుందర్ కు పాటలు అంటే పిచ్చి. కుమారుడు నాటకాలు చూస్తానని ఆశపడితే.. డ్రైవర్ ను ఇచ్చి కార్ లో పంపేవారు. అలా నాటకాల పట్ల, నృత్యం పట్లా ఆకర్షితులైన శివశంకర్ మాస్టర్ పట్టుదలతో డాన్స్ నేర్చుకున్నారు. ఆయనకు 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి నృత్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. ఈ విషయం వారింట్లో కూడా తెలిసింది. చదువుకోకుండా.. నృత్యప్రదర్శనాలు ఇస్తున్నందుకు ఇంట్లో తిట్లు కూడా తిన్నారట.
ఆయన తండ్రి ఒకసారి పండితుల వద్ద మాస్టర్ గారి జాతకాన్ని చూపించారట. వారు శివశంకర్ మాస్టర్ గొప్ప డాన్సర్ అవుతాడని.. డాన్స్ లో ఆయనకు మంచి భవిష్యత్ ఉందని చెప్పారట. దీనితో.. శివశంకర్ మాస్టర్ తండ్రి కూడా ఆయనకు డాన్స్ నేర్పించాలని భావించారు. ఆయనను ఆయన తండ్రి నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద చేర్పించారు. అక్కడ శిష్యరికం చేస్తూ.. ఆడవాళ్లు, మగవాళ్ళు హావభావాలను ఎలా పలికిస్తారో నేర్చుకున్నారు.
ఆ తరువాత కజిన్ సిస్టర్ సాయంతో డాన్స్ డైరెక్టర్ సలీం వద్ద అసిస్టెంట్ గా చేరారు. అలా సినిమాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగారు. అమ్మోరు, యమదొంగ, అరుంధతి వంటి సినిమాలకు ఆయనకు బాగా పేరొచ్చింది. “ధీర ధీర” సాంగ్ కి ఆయనకీ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. పలు సినిమాల్లో నటుడిగాను రాణించారు. తమిళం లో దాదాపు 30 సినిమాలు చేసారు.
End of Article