Ads
నందమూరి బాలకృష్ణ ”Unstoppable with NBK”అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడో ఎపిసోడ్ ని కామెడీ కింగ్ బ్రహ్మానందం తో పాటు కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి బాలకృష్ణ చేయనున్నారు. మొదటి రెండు ఎపిసోడ్లు తర్వాత ఇప్పుడు మూడో ఎపిసోడ్ రాబోతోంది.
Video Advertisement
మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు గెస్ట్ కింద వచ్చారు. ఆ తర్వాత రెండో ఎపిసోడ్ లో నాని తో టాక్ షో నిర్వహించారు. ఇప్పుడు మూడవ ఎపిసోడ్ కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.
అయితే బాలకృష్ణ కి అఖండ షూటింగ్ సమయంలో చేతికి గాయం అయిన సంగతి తెలిసిందే. అందుకని బాలకృష్ణ ఎలా ఉన్నారంటూ ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు ఎప్పుడు అని…. వారం వారం రావడానికి నేను సీరియల్ కాదు సెలబ్రేషన్. ‘ది ఎనర్జీ ఈజ్ బ్యాక్’ అంటూ నెక్స్ట్ ఎపిసోడ్ ఈవారం ప్రసారం కానుంది. మరి బాలయ్య బాబుతో బ్రహ్మానందం అనిల్ రావిపూడి కలిసి చేసే కామెడీ ఎలా ఉంటుంది అనేది చూడాలి.
End of Article