Ads
బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ పై బాగానే ఎలివేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య లీడ్ రోల్ చేస్తున్న ఏ సినిమా అయినా వన్ మాన్ షో అయిపోతుంది.
Video Advertisement
బాలకృష్ణకి అఖండ చిత్రం మంచి హిట్ ని తీసుకు వచ్చిందని చెప్పాలి. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ తర్వాత వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర గర్జించింది. ఈ చిత్రం హిట్ అవడంతో అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు.
ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎంతోకొంత ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇక విలన్ గా నటించిన నితిన్ మెహతా సంగతి సరే సరి. అదరగొట్టేసాడు అనే చెప్పాలి. స్వామిజి పాత్రలో కనిపించిన నితిన్ మెహతా గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపు రాలేదు. అఖండ సినిమాతో ఆయనకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.
నితిన్ మెహతా దాదాపు 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీ కి సేవలు అందించారు. ఆయన తన జీవితంలో ఒక ప్రొఫెషనల్ మోడల్ గా, సినిమాల్లో నటుడుగా రాణించాలని కోరుకున్నారు. ఆర్మీ లో పని చేయడాన్ని కూడా ఆయన ఇష్టపడేవారు. కానీ.. సినిమాల్లో నటించాలని ఉండడంతో.. అవకాశం రాగానే తనకు ఇష్టమైన ఆర్మీ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీ వైపుకి వచ్చేసారు.
“అఖండ” సినిమా విజయం సాధించడంతో ఆయన పేరు కూడా మారుమ్రోగిపోతుంది. ఆయన ఎవరు అని నెటిజన్స్ కూడా గూగుల్ తో తెగ వెతికేస్తున్నారట. ఆయన ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారట. ఎట్టకేలకు నితిన్ మెహతా అఖండ సినిమాతో తన కల నెరవేర్చుకున్నారనే చెప్పాలి.
Also Read: అఖండ సినిమా చూసి బాలయ్య అభిమాని కాల్… పరమశివుడుని చూసామంటూ…!!
End of Article