Ads
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి ఎన్నో చిత్రాల్లో నటించింది. తక్కువ టైం లోనే నటి ఉమాదేవి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఉమాదేవి యూట్యూబ్ వీడియోలు, ఈవెంట్లు వంటి వాటిని చేస్తున్నారు.
Video Advertisement
ఉమాదేవికి అవకాశాలు బాగానే వచ్చిన టైం లో ఆమె ఎంచుకున్న కొన్ని పాత్రలు ఆమె కెరీర్ కి మైనస్ అయ్యాయి. అలాంటిదే “సై” సినిమాలోని పాత్ర.
ఈ సినిమాలో వ్యాంప్ తరహా పాత్ర చేయడంతో ఆమె కెరీర్ తలక్రిందులైంది. సినీ పరిశ్రమకి వచ్చిన తొలినాళ్లలో ఉమా దేవి గట్టిగానే ప్రయత్నించారు. కొంతవరకు ఆమెకు మంచి పాత్రలే దక్కాయి. ఓ దశలో ఆమెకు అవకాశాలు తగ్గడంతో.. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆమె చేసిన పాత్రలు ఆమె కెరీర్ ని తలకిందులు చేసాయి.
ఇటీవల ఓ యుట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఉమా దేవి తన కెరీర్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. రాజమౌళి దర్శకత్వం వహించిన “సై” సినిమాని తన భర్త రీసెంట్ గానే చూసారని.. ఈ సినిమాలో ఆ పాత్రలో నటించింది నువ్వేనా అంటూ అడిగారని చెప్పుకొచ్చారు. ఇటువంటి పాత్రలో నటించావేంటి..? నాకెప్పుడూ చెప్పలేదే..? అంటూ అడిగారట.
ఆ సమయంలో క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్లే అలా నటించానని.. ఎలాంటి దురుద్దేశం లేదని తనకి చెప్పానని.. తాను కూడా నన్ను బాగా అర్ధం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మా ఇద్దరికీ ఇలా అర్ధం చేసుకునే గుణం ఉండడం వల్లే హ్యాపీ గా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నామని చెప్పుకొచ్చారు.
End of Article