Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది.
ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ ఆర్ ఆర్ టీం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ విలేఖరి ఈ సినిమాలో హీరో ఎవరు అంటూ జక్కన్నకి చిక్కు ప్రశ్న ఇచ్చాడు. ఎన్టీఆర్ అని చెప్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కోపం వస్తుంది. రామ్ చరణ్ అని చెప్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం వస్తుంది. అందుకే జక్కన్న తెలివిగా హీరో ని నేను.. అంటూ సరదాగా చెప్పి నవ్వేశారు.
End of Article