Pushpa: మారేడుమిల్లి అడవుల్లో శేషాచలం ఎర్రచందనం ఎలా వచ్చింది..? దాని వెనుక ఉన్న ఈ జంట ఎవరో తెలుసా..?

Pushpa: మారేడుమిల్లి అడవుల్లో శేషాచలం ఎర్రచందనం ఎలా వచ్చింది..? దాని వెనుక ఉన్న ఈ జంట ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

పైగా ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా వున్నాయి. ఈ సినిమాలో ఎర్రచందనం సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి.

Video Advertisement

పైగా ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా వున్నాయి.

pushpa 2

ఈ సన్నివేశాలన్నీ శేషాచలం అడవులలో జరిగినట్లు కనిపిస్తాయి. కానీ వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ అంతా మారేడుమిల్లిలోనే జరిగింది. మారేడుమిల్లి పరిసర ప్రాంతాలలో ఎక్కడా ఎర్రచందనం చెట్లు కనిపించవు. పుష్ప కోసం ప్రత్యేకంగా వాటిని తీసుకొచ్చి షూటింగ్ జరిపారు. ఈ ఏర్పాట్లు అన్ని రామ‌కృష్ణ‌-మోనిక‌ దంపతులే దగ్గరుండి చూసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఎర్ర చందనం సీన్స్ చాలా హైలైట్ అవడంతో వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లయింది.

pushpa 6

మొదట ఓ రెండు లారీల ఎర్ర చందనం దుంగలు తెస్తే సరిపోతుందని అనుకున్నారు. కానీ.. కనీసం యాభై లారీల దుంగలు అయినా అవసరం అవుతాయని సుకుమార్ చెప్పేసరికి.. చాలా కష్టమైంది. యాభై లారీలు అంటే కనీసం పది వేల నుంచి యాభై వేల దుంగలు అవసరం అవుతాయి. ఈ దుంగలన్నీ రామకృష్ణ-మోనిక జంట సృష్టించినవే. లారీలు కూడా అంతే. దాదాపు వంద లారీల వరకు సినిమాలో కనిపిస్తాయి. ఏది చూసిన భారీగానే లెక్కలు తేలుతోంది. మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి ఇంత భారీ బడ్జెట్ ని పెట్టుకోగలిగారు అంటూ ఈ జంట చెప్పుకొచ్చారు.

pushpa 4

మేము బస చేసిన హోటల్ నుంచి షూటింగ్ స్పాట్ కి వెళ్లాలంటే రెండున్నర గంటలు పట్టేది. ఆ షూటింగ్ స్పాట్ కూడా ఎక్కడో కొండపైన ఉంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో సహా అన్ని డిపార్ట్మెంట్స్ అంత పైకి వెళ్లాల్సి వచ్చేది. 500 ల నుంచి 1500 ల మంది యూనిట్ మెంబెర్స్ ఉన్నారు. వీరందరికి.. అంత పైకి ఎక్కి కొండపైన ఫుడ్ ఆరెంజ్ చేయడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ లో రోడ్డుపై జిగ్ జాగ్ గా లారీలు వెళ్తూ కనిపిస్తాయి. ఆ సన్నివేశాన్ని షూట్ చేయడానికి పడ్డ కష్టం మాములుగా లేదు.

pushpa 5

అసలు అక్కడ రోడ్డు సౌకర్యం కూడా లేదు. షూటింగ్ స్పాట్ కి వెళ్ళడానికి కూడా మట్టి రోడ్డుని మేమే వేసుకోవాల్సి వచ్చింది. ఇక షూటింగ్ స్పాట్ లో కనిపించే రాళ్ళూ రప్పలు కూడా సృష్టించాల్సి వచ్చింది. ఓ సారి షూటింగ్ గ్యాప్ లో ఒక రాయి పై అల్లు అర్జున్ కూర్చుందామని అనుకున్నారు. ఆ తర్వాత కానీ.. అది అసలు రాయి కాదని, సృష్టించిన నకిలీ రాయి అని తెలియలేదు. తరువాత చెక్ చేస్తే.. అక్కడ ఉన్న చాలా రాళ్లు ఈ జంట సృష్టించినవే. వాటిల్లో అసలువేదో నకిలీవేదో తెలియనంతగా ఈ జంట కష్టపడ్డారు. ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటుంటే ఈ జంట సంతోషంగా ఫీల్ అవుతున్నారు.


End of Article

You may also like