Ads
మెగా కాంపౌండ్ లో హీరోలకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ సమంత. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరోతో నటించినా.. ఆ సినిమా పక్కా హిట్ అవుతూ వచ్చింది. 2013 లో మొదటిసారి పవర్ స్టార్ తో కలిసి “అత్తారింటికి దారేది” సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
Video Advertisement
ఆ తరువాత 2015 లో అల్లు అర్జున్ తో “సన్ ఆఫ్ సత్యమూర్తి” లో నటించింది. ఈ సినిమా కూడా అంచనాలను అందుకుని మంచి కలెక్షన్లనే రాబట్టింది.
తరువాత 2018 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి “రంగస్థలం” లో రామలక్ష్మిగా దుమ్ము దులిపింది. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూడు సినిమాలతోను హిట్స్ సొంతం చేసుకుంది. తాజాగా.. తిరిగి బన్నీ పక్కన స్పెషల్ సాంగ్ లో ఇరగ దీసింది. “ఊ అంటావా మావ.. ఊహు అంటావా మావా..” అంటూ బన్నీ పక్కన స్టెప్పులేసింది.
ఈ పాట లో సమంత నర్తిస్తోంది అన్న అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే సందడి మొదలైంది. ఇక సాంగ్ ట్రైలర్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఇలా మెగా కాంపౌండ్ లో ఏ హీరోతో సినిమా చేసినా పక్కా హిట్ అయిపోతుంది. ఇక ఈ సినిమాల్లో ఉన్న కామన్ ఫాక్టర్ ఏంటో తెలుసా..? మెగా హీరోలతో సమంత చేసిన సినిమాలన్నిటికీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ఇప్పటివరకు ఈ కాంబో లో వచ్చిన సినిమాలు అన్ని హిట్ అవుతూ వచ్చాయి. పుష్ప కూడా పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంటుంది. మరి ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్ ను పుష్ప రాజ్ క్రాస్ చేస్తాడో వేచి చూడాలి.
End of Article