Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా వున్నాయి. ఈ సినిమాలో ఎర్రచందనం సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి.
Video Advertisement
ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయ్యారు. ఇటీవల కన్నడ మీడియా ప్రెస్ మీట్ లో జరిగిన సంఘటన ఆయనను ప్రేక్షకుల గుండెల్లో ఇంకో మెట్టు ఎక్కించేసింది.
పుష్ప రిలీజ్ సందర్భంగా కన్నడ మీడియా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ పాల్గొనాల్సి వచ్చింది. అయితే..ఆయన ఆలస్యంగా వెళ్లారు. దీనితో కన్నడ మీడియా రిపోర్టర్ 11.15 నిమిషాలకు జరగాల్సిన ప్రెస్ మీట్ కి మధ్యాహ్నం 1.15 నిమిషాలకు వస్తే ఎలా? అంటూ సీరియస్ గా ప్రశ్నించాడు. దీనితో.. ఇక్కడ ప్రెస్ మీట్ ఉన్న విషయం ఇందాకే తెలిసిందని.. వెంటనే ప్రైవేట్ జెట్ లోనే వచ్చానని.. కానీ మంచు తెరలు కమ్మడం వల్ల ఇబ్బంది ఎదురై మధ్యలో ఆగిపోయామని.. అందుకే లేట్ అయిందని..ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని బన్నీ కోరాడు.
సారీ చెప్పినా.. మనిషిగా బన్నీ ఎదిగాడు అని ఈ సంఘటన ప్రూవ్ చేస్తుంది. మరో వైపు ఫాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే ఇండస్ట్రీ హీరో అవ్వడం వల్లే ఇలా చేస్తున్నారని.. అదే మీ ఇండస్ట్రీ హీరోలు లేట్ గా వస్తే ఇలానే క్వశ్చన్ చేయగలరా..? అంటూ తిట్టిపోస్తున్నారు. మరి కొందరు ఫ్యాన్స్ మాత్రం ప్రెస్ మీట్ టైం లో బన్నీ హేండిల్ చేసిన తీరు బాగుందంటూ మెచ్చుకుంటున్నారు.
End of Article