Ads
ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు.
Video Advertisement
ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే యు ట్యూబ్ లో దుమ్ము దులిపింది. ఫహద్ చెప్పిన “పార్టీ లేదా పుష్పా” అనే డైలాగు బాగా ఫేమస్ ఐంది. ఈ డైలాగు తో సోషల్ మీడియాలో కూడా చాలానే మీమ్స్ హల్ చల్ చేసాయి.
తాజాగా.. సైదాబాద్ పోలీసులు కూడా ఈ పాపులారిటీని వాడుకున్నారు. ఈ పాపులారిటీని ఉపయోగించి ప్రజలలో అవేర్ నెస్ పెంచే ప్రయత్నం చేసారు. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ తో మీమ్స్ క్రియేట్ చేసి ప్రజలలో అవేర్ నెస్ ను పెంచడం ఇది మొదటి సారి కాదు. ఇది సైదాబాద్ పోలీసులకు వెన్నతో పెట్టిన విద్య.
తాజాగా.. మరోసారి అటువంటి మీమ్ నే సోషల్ మీడియా లో పంచుకున్నారు. పుష్ప రాజ్ బైక్ తోలుతున్న సీన్ ను తీసుకుని కింద ఫహద్ స్క్రీన్ షాట్ ను పెట్టారు. హెల్మెట్, మిర్రర్స్ లేవా పుష్పా అంటూ మీమ్ ను క్రియేట్ చేసారు. సైదాబాద్ పోలీసులు పోస్ట్ చేసిన ఈ ట్వీట్ గా బాగా రెస్పాన్స్ వస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని సోషల్ మీడియా లో అవేర్ నెస్ క్రియేట్ చేయడంలో సైదాబాద్ పోలీసులు ఎప్పుడు ముందుంటారు అన్న విషయం మరోసారి రుజువైంది.
Wear Helmet & Fix Rearview Mirrors. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad #Pushpa #PushpaRaj pic.twitter.com/USlupBLHIR
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) December 17, 2021
End of Article