Ads
నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నాని తో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది.
Video Advertisement
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ కూడా ఓ రేంజ్ లో ఉంది.
అయితే.. ఈ సినిమాలో నాని గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాని ఓ రోల్ లో అప్ కమింగ్ డైరెక్టర్ గా కనిపిస్తుండగా.. మరో రోల్ లో బెంగాలీ రైటర్ గా మీసాలతో కనిపించనున్నారు. ఈ మూవీ కోసం నాని చాలా కష్టపడ్డారట. సినిమాలో డిఫరెంట్ గా కనిపించడం కోసం నాని దాదాపు 15 విభిన్న రకాల గెటప్స్ ను ట్రై చేశారట. చివరకు.. బెంగాలీ రైటర్ గా ట్రైలర్ లో కనిపించిన లుక్ ని ఫైనల్ చేశారట. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, మీసాలు అన్ని చేంజ్ చేసాడు. కొంచం బొద్దుగా కనిపించేలా ఈ లుక్ ని ట్రై చేసారు. కానీ, నాని ఈ గెటప్ కోసం బరువు మాత్రం పెంచలేదట.
End of Article