Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది.
Video Advertisement
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కలం తర్వాత ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడం, అది కూడా ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్ లో చూడడం అనే విషయం సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచింది.
తాజాగా.. ఈ సినిమా నుంచి “శానా కష్టం..” అంటూ సాగే ఓ పాటని విడుదల చేసారు. ఈ పాట లో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి రెజీనా స్టెప్పులేశారు. ఐటెం సాంగ్ మాదిరిగా ఉండే ఈ పాటకు మెగాస్టార్ స్టెప్పులు ఇరగదీసారు. పాట మంచి ఊపు మీద జోరుగా సాగుతున్నట్లుంది. నెటిజన్స్ ఓ వైపు పాట బాగుంది అని మెచ్చుకుంటూనే.. మరో వైపు ఎక్కడో విన్నట్లుందే అని ఆలోచించడం స్టార్ట్ చేసారు.
ప్రతి పాటకు ఎదో ఒక ఇన్స్పిరేషన్ ఉండనే ఉంటుంది. అయితే.. అదే ట్యూన్ లో వేరే పాటని రాసేస్తే మాత్రం కాపీ అనే అంటారు. ఈ పాట కూడా కాపీ చేశారు అంటూ నెటిజన్స్ అప్పుడే విమర్శించడం మొదలు పెట్టేసారు. ఇంతకీ ఈ పాటని ఎక్కడ నుంచి కాపీ చేసారో తెలుసా..? ఓ హిందీ మూవీ నుంచి.
హిందీ సినిమా టార్జాన్ దాదాపు 37 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ సినిమా 1985లో వచ్చింది. ఈ సినిమాలో ఓ పాట “జిలేలే జిలేలే ” అనే ట్యూన్ లో సాగుతుంది. ఈ పాటకి బప్పీలహరి సంగీతం అందించారు. ఆచార్య లో “శానా కష్టం” పాటలో కూడా కల్లోలం.. కల్లోలం అంటూ వచ్చే లైన్ ఇదే ట్యూన్ లో ఉంటుంది. ఇది తెలిసే జరిగిందో.. తెలియక జరిగిందో తెలియదు. కానీ.. చాలా మంది ఈ పాటని కూడా కాపీ చేసేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Watch Video:
End of Article