Ads
నటుడు నాగ మహేష్ కు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు ఉంది. ఈ మధ్యే ఆయనకు పెద్ద సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల అఖండలో కూడా చిన్న పాత్రలో నటించారు. ఆయన పాత్ర చిన్నదే అయినా.. ఆయనకీ మంచి గుర్తింపు వచ్చింది.
Video Advertisement
ఖైదీ 150 లో కూడా నాగ మహేష్ నటించారు. ఈ సినిమాలో తనని చూసిన సుకుమార్ తొలుత తమిళ నటుడో.. మలయాళ నటుడో అయ్యుంటారని అనుకున్నారట. ఆ తరువాత తెలుగు వ్యక్తే అని తెలిసే సరికి సుకుమార్ ఆఫీస్ కి పిలిపించారట.
తొలుత ఆయన గురించి గూగుల్ సెర్చ్ లో వెతికారట. అయితే తెలియకపోవడంతో తెలిసిన వాళ్ళ ద్వారా నాగ మహేష్ ను సంప్రదించారట. అలా సుకుమార్ నాగ మహేష్ కు రంగస్థలంలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో కనీసం “ఖైదీ 150 ” లో ఉన్న డ్యూరేషన్ అయినా ఉండాలని నాగ మహేష్ సుకుమార్ ని కోరారట. సుకుమార్ కూడా తనను చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారని నాగ మహేష్ చెప్పుకొచ్చారు.
ఆ తరువాత నాగ మహేష్ కు రంగస్థలంలో సమంత తండ్రి పాత్రని పోషించే అవకాశం ఇచ్చారట. తొలుత ఆ సినిమాలో ఇన్స్పెక్టర్ రోల్ ఇవ్వాలనుకున్నారట. ఆ తరువాత సమంతకి తండ్రిగా నటించే అవకాశం ఇచ్చారట. ఆ పాత్ర కు ఎలాంటి హోమ్ వర్క్ చేయకుండానే నటించినట్లు నాగ మహేష్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా లో తన గెట్ అప్ కొంచం బాలేదని చెప్పుకొచ్చారు.
ఆ సినిమా తరువాత జాంబీరెడ్డి, ఉప్పెన సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయన్నారు. భరత్ అను నేను సినిమాలో కూడా తానూ నటించానని.. కానీ ఆ సీన్లు ఎడిటింగ్ లో పోయాయని నాగ మహేష్ బాధపడ్డారు. 2017 లో ఏప్రిల్ 1 వ తేదీన నిమ్స్ ఆసుపత్రిలో తన భార్య చనిపోయిందని గుర్తు చేసుకున్నారు. నాలుగురోజుల్లో అంటే ఏప్రిల్ 5 వ తేదీ నాటికి తాను రంగస్థలంలో సమంత కు తండ్రిగా నటించాల్సి ఉంది. ఆ పరిస్థితిల్లో ఊరి పొలిమేర దాటకూడదని ఊరి పెద్దలు చెప్పారని.. కానీ భార్య పోయిందని.. ఆఫర్ ని కూడా వదిలేయలేం కదా అని.. నటించానని ఆ రోజుల్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో నరకం చూశానని చెప్పుకొచ్చారు.
End of Article