“డేవిడ్ వార్నర్” పుష్ప రీల్ వెనుక ఇంత అర్ధం ఉందా..? అంటే ఇప్పుడు..?

“డేవిడ్ వార్నర్” పుష్ప రీల్ వెనుక ఇంత అర్ధం ఉందా..? అంటే ఇప్పుడు..?

by Mohana Priya

Ads

క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు టిక్‌టాక్‌లో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఇలా ఏ కొత్త పాట వస్తే ఆ పాటపై డాన్స్ చేసి ఆ వీడియో షేర్ చేస్తూ ఉంటారు. డేవిడ్ వార్నర్ చేసిన బుట్టబొమ్మ వీడియో అయితే చాలా వైరల్ అయింది.

Video Advertisement

ఆ తర్వాత రాములో రాముల, మైండ్ బ్లాక్ ఇంకా చాలా పాటలకి ఇలాగే డాన్స్ చేసి ఆ వీడియోలని షేర్ చేశారు డేవిడ్ వార్నర్. అవి కూడా వైరల్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే క్రికెటర్లు ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం అనే ట్రెండ్ క్రియేట్ చేసారు వార్నర్.

తర్వాత వార్నర్ బాటలోనే చాలా మంది క్రికెటర్లు కూడా ఇలాగే రీల్స్ చేసి షేర్ చేశారు. ఇప్పుడు కూడా డేవిడ్ వార్నర్ పుష్ప సినిమాలోని కొన్ని డైలాగ్స్, పాటలపై కొన్ని రీల్స్ చేసి షేర్ చేసారు.శ్రీవల్లి పాట కన్నడ వెర్షన్ మీద కూడా ఒక రీల్ చేసి షేర్ చేసారు. ప్రస్తుతం ఆ రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ రీల్ చూసిన చాలా మందికి ఒక డౌట్ వస్తోంది. అదేంటంటే వార్నర్ కన్నడ వెర్షన్ పాట మీద డాన్స్ చేశారు.

david warner pushpa reel hints about ipl 2022

అంటే ఇండైరెక్ట్ గా నెక్స్ట్ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున వార్నర్ ఆడబోతున్నారు అని చెప్తున్నారా అంటున్నారు. అంతకుముందు కూడా డేవిడ్ వార్నర్ చేసిన ఒక వీడియోపై విరాట్ కోహ్లీ కామెంట్ చేశారు. అప్పుడు కూడా ఇదే విషయంపై చర్చ జరిగింది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ కొత్త ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ కూడా ఇలాగే చర్చలకు దారి తీసింది. ఒకవేళ ఇదే నిజమా? తెలియాలంటే అధికారికంగా ప్రకటించేంత ఆగాల్సిందే.

watch video :

https://www.instagram.com/reel/CY_KjWaJ-fh/?utm_medium=copy_link


End of Article

You may also like