Ads
సినిమా అనేది మనకు ఎంటర్టైన్మెంట్ కావచ్చు కానీ అందులో పని చేసే వాళ్ళకి ఒక ప్రొఫెషన్. అందుకే చాలా మంది నటులు తమ పని కేవలం నటించడం మాత్రమే అన్నట్టు ఉంటారు. అంటే, కొంత మంది నటులకి తమ వయసుకి మించిన పాత్రలు, లేదా తమ వయసు కంటే తక్కువ వయసు ఉన్న పాత్రలు వస్తాయి. కొంత మంది అలాంటి రోల్స్ ని రిజెక్ట్ చేస్తారు.
Video Advertisement
కానీ కొంత మంది మాత్రం పాత్ర వయసు ఏదైనా సరే, అది కేవలం ఒక రోల్ మాత్రమే. వాళ్ళ పని ఆ పాత్రకు న్యాయం చేయడం మాత్రమే అని అనుకొని ఎలాంటి పాత్ర అయినా సరే ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంటారు.
ఒక సినిమాలో తమ కో – స్టార్ గా నటించిన యాక్టర్ కే ఇంకొక సినిమాలో తల్లిగా, తండ్రిగా, లేకపోతే బ్రదర్ లేదా సిస్టర్ గా నటిస్తారు. అలా మన ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్ ఒక సినిమాలో వాళ్లకు కో – స్టార్ అయిన నటులకి మరొక సినిమాలో తల్లిగా నటించారు. వాళ్ళు ఎవరంటే.
#1 భానుమతి
భానుమతి గారు, ఎన్టీ రామారావు గారితో మల్లీశ్వరి, తోడు నీడ సినిమాల్లో నటించారు. తర్వాత 1992 లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో ఎన్టీఆర్ గారికి తల్లిగా నటించారు.
#2 “ఊర్వశి” శారద
శారద గారు, సూపర్ స్టార్ కృష్ణ గారితో రాధమ్మ పెళ్లి, ఆడంబరాలు, అనుబంధాలు, ఇంద్రధనస్సు సినిమాల్లో నటించారు. అగ్ని కెరటాలు, రౌడీ నెంబర్ వన్, అగ్నిపర్వతం సినిమాల్లో కృష్ణ గారికి తల్లిగా నటించారు.
#3 అంజలీ దేవి
అంజలీ దేవి గారు, ఏఎన్ఆర్ గారితో కలిసి భక్తతుకారాం, సువర్ణసుందరి సినిమాల్లో నటించారు. తర్వాత కొన్ని సినిమాల్లో ఏఎన్ఆర్ గారికి తల్లిగా నటించారు.
#4 వరలక్ష్మి
వరలక్ష్మి గారు, ఎన్టీఆర్ గారి తో బబ్రువాహన, మహామంత్రి తిమ్మరుసు, సత్య హరిశ్చంద్ర సినిమాల్లో నటించారు. కలియుగ రాముడు, ప్రేమ సింహాసనం, వయ్యారి భామలు వగలమారి భర్తలు, అగ్గి రవ్వ సినిమాల్లో ఎన్టీఆర్ గారికి తల్లిగా నటించారు.
#5. జయసుధ
చిరంజీవి ఇంకా జయసుధ కలిసి మగధీరుడు సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇది కథ కాదు సినిమా లో కూడా నటించారు. తర్వాత చిరంజీవి హీరోగా నటించిన రిక్షావోడు సినిమాలో జయసుధ చిరంజీవి కి తల్లిగా నటించారు.
#6. సుజాత
చిరంజీవి, సుజాత కలిసి ప్రేమ తరంగాలు సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. తర్వాత సీత దేవి సినిమాలో అన్నా చెల్లెళ్ళు గా నటించారు. చిరంజీవి హీరోగా నటించిన బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి కి తల్లిగా నటించారు సుజాత.
End of Article