Ads
కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత క్రాక్ తో బ్లాక్ బస్టర్ కం బ్యాక్ ఇచ్చారు రవితేజ. దాంతో ఖిలాడి కూడా మరొక హిట్ అవుతుంది అని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా సినిమా బృందం కూడా సినిమా చాలా కొత్తగా ఉంటుంది అని, ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి అని చెప్పారు.
Video Advertisement
నిజంగానే సినిమా టెక్నికల్‌గా చాలా రిచ్‌గా అనిపిస్తుంది. అలాగే ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్‌లో డిజైన్ చేశారు.
ఇక ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ డింపుల్ హయతి. ఈ సినిమాలో ఓ పాట కోసం ఆమె ఏకంగా ఆరు కేజిల బరువు కూడా తగ్గారు. సినిమాల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తే ఆమెను ఈ రంగం వైపుకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఆమె 2017 లోనే గల్ఫ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తరువాత దేవి 2 , అభినేత్రి 2 సినిమాలతో తమిళ ప్రేక్షకులకి కూడా పరిచయం అయ్యారు.
అయితే.. ఈ సినిమాలేవీ ఆమెకు తెలుగు నాట పాపులారిటీ తీసుకురాలేదు. ఆమెకు ఎక్కువ పాపులారిటీ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గడ్డలకొండ గణేష్ సినిమాతో వచ్చింది. ఆ సినిమాలో ఆమె ఓ ప్రత్యేక గీతంలో నటించారు. ఈ ఐటెం సాంగ్ తో ఆమె పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో ఆమె హీరోయిన్ అయ్యారు. ఈ సినిమా విజయం ఆమె కెరీర్లో మరో మలుపు తీసుకొస్తుందని భావిద్దాం.
End of Article