269
Ads
ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్నక్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది.
ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందునుండే అసలు ఈ సారి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇటీవల ఐపీఎల్ ఆక్షన్ జరుగుతోంది. ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్లని చాలా జట్లు బిడ్ చేశారు. డేవిడ్ వార్నర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తీసుకున్నారు.
డేవిడ్ వార్నర్ చెన్నై సూపర్ కింగ్స్ కి కానీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కానీ కొనుగోలు చేస్తుంది అని అనుకున్నారు.
అంతే కాకుండా, సురేష్ రైనాని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీసుకోకపోవడం కూడా యాజమాన్యంపై కొంత విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు ఇవన్నీ కాదన్నట్టు మరొక కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అందుకు కారణం ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహీష్ ని 70 లక్షలకి తీసుకున్నారు.
తమిళులకి అంత పెద్ద అన్యాయం చేసిన లంకేయులని జట్టులోకి ఎలా తీసుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే అతనిని జట్టులో నుండి తొలగించాలి అని అంటున్నారు. లేదంటే ఐపీఎల్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని బ్యాన్ చేయాలి అని అంటున్నారు. సురేష్ రైనాలాంటి ప్లేయర్ ని వదిలేసి, ఇతనిని ఎలా తీసుకున్నారు అని, సురేష్ రైనాని జట్టులోకి మళ్లీ తీసుకురావాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
End of Article