Ads
మనదేశంలో చాలా మందికి ఎదురవుతున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఎంత టాలెంట్ ఉన్నా.. లుక్స్ ని మాత్రమే మొదటగా చూస్తుంటారు. చాలా మంది అలాంటి ఇబ్బందులను దాటుకునే జీవితంలో సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో దాసరి పార్వతి కూడా ఒకరు. అందానికి ఇచ్చే ప్రాముఖ్యత చాలా మందికి టాలెంట్ కి ఇవ్వరు. కానీ.. అందం కంటే టాలెంట్ ముఖ్యమని సింగర్ దాసరి పార్వతి నిరూపించారు.
Video Advertisement
ఈమె “జీ సరిగమ” ప్రోగ్రాం లో కంటెస్టెంట్. ఇటీవల ఆమె సరిగమప సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. ఆమె గాత్రానికి జడ్జిలు సైతం మంత్రముగ్ధులైపోయారు. ఇటీవలే ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.
కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామానికి చెందిన పార్వతిది వ్యవసాయాధారిత కుటుంబం. పార్వతికి ఇద్దరు అన్నలు ఉన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న పార్వతి.. సంగీతంపై మక్కువతో పక్క ఊరికి వెళ్లి మరీ సంగీతం నేర్చుకునేది. వారి ఊరికి బస్సు సౌకర్యం లేదు. ఆమె రోజు కాలినడకన వెళ్లి నేర్చుకుని వచ్చేది. ఆమె అద్భుతంగా పాటలు పాడతారు.
ఒకప్పుడు కాకిలాంటి రూపం.. కోయిల లాంటి గానం అంటూ ఒకప్పుడు హేళన చేసినవారిని ఇప్పుడు తనని దేవత అంటూ మెచ్చుకుంటున్నారు. కలర్ ముఖ్యం కాదు.. ప్రతిభే ముఖ్యం అని పార్వతి నిరూపించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆమె జడ్జి ఆమెని మెచ్చుకుని.. ఏమి కావాలో కోరుకోవాలని అడుగగా.. మా ఊరికి బస్సు సౌకర్యం లేదని.. బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుకుంది.
అక్కడే ఆమె వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో తెలుస్తోంది. ఇలాంటి వారి వల్లే రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. తన మొదటి పాటతోనే ఎంతోమంది ఆదరణని చూరగొన్న పార్వతి మరిన్ని అవకాశాలను దక్కించుకుని.. టాప్ సింగర్ గా ఎదగాలని కోరుకుందాం.
End of Article